Asianet News TeluguAsianet News Telugu

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

 వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కత్తి దాడి ఓ జగన్నాటకమని విమర్శించారు. జగన్నాటకం రక్తికట్టకపోగా సెల్ఫో గోల్ అయ్యిందని ఎద్దేవా చేశారు. 

minister ganta srinivasarao fires on ys jagan
Author
Amaravathi, First Published Oct 26, 2018, 7:06 PM IST

అమరావతి: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ కత్తి దాడి ఓ జగన్నాటకమని విమర్శించారు. జగన్నాటకం రక్తికట్టకపోగా సెల్ఫో గోల్ అయ్యిందని ఎద్దేవా చేశారు. 

మరోవైపు ఏపీ పోలీస్ వ్యవస్థను జగన్ అపహాస్యం చేసేలా వ్యవహరించారని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. దాడి ఘటనపై ఏపీ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వనని జగన్‌ నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీలో రాజకీయాలు చేసే వ్యక్తి రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని తెలంగాణ పోలీసులకు వాంగ్మూలం ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు.

పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యవహరించారని ఈ విషయంలో చారిత్రక తప్పిదం చేశారని గంటా వ్యాఖ్యానించారు. పోలీసులపై నమ్మకం లేకపోతే విచారణ తర్వాత కోర్టులను ఆశ్రయించాలే తప్ప ఈవిధంగా వాంగ్మూలం ఇవ్వనంటూ వితండవాదం చేయడం మంచిది కాదని హితవు పలికారు. 

అమరావతిలో కలెక్టర్ల సదస్సు, విశాఖలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌, ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ నుంచి ప్రజల దృష్టిని మరల్చాలనే ప్రయత్నంలో భాగంగా దాడి ఘటనను సృష్టించినట్లు తాను భావిస్తున్నానన్నారు. గతంలో భాగస్వామ్య సదస్సు సమయంలోనూ విశాఖలో జగన్‌ ఇదే విధంగా ప్రవర్తించారని గంటా విమర్శించారు.

విశాఖ విమానాశ్రయం సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండర్‌ దినేశ్‌కుమార్‌ నిందితుడి వద్ద లేఖ గుర్తించిన విషయంతోపాటు దాడి జరిగిన విధానాన్ని ప్రాథమిక నివేదికలో పొందుపరిచారని  ఆ నివేదిక ఆధారంగానే రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. 

ఘటన జరిగిన చాలా సేపటి తర్వాత లేఖ బయటకి వచ్చిందని తెదేపా నేతలు, ప్రభుత్వమే దీన్ని సృష్టించారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని గంటా తప్పుబట్టారు. ఐదేళ్లపాటు పాలించమని ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేసేవిధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కుట్ర పన్నుతూ ఆ పార్టీ నేతలు చేసే విమర్శలు వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని గంటా మండిపడ్డారు.
 

ఈ వార్తలు కూడా చదవండి

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత

Follow Us:
Download App:
  • android
  • ios