విశాఖపట్నం: వైసీపీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడ్డ నిందితుడు శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు. నిందితుడుని విచారణ నిమిత్తం కోర్టుకు తరలిస్తుండగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఎలాంటి తడబాటు లేకుండా సమాధానాలు చెప్పాడు. 

నేను ఏం చెప్పాలనుకున్నానో అదే లేఖలో రాశానని లేఖలో చూసుకోండి అని మీడియాకు చెప్పాడు. లేఖ తన బంధువు మిత్రుడు రాశారని తాను ఒక పేజీ రాసినట్లు చెప్పాడు. ఆ తర్వాత నిందితుడుని భారీ పోలీస్ బందోబస్తు నడుమ పోలీసులు కోర్టుకు తరలించారు. 

వైఎస్ జగన్ శుక్రవారం కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో గురువారం పాదయాత్రకు విరామం చెప్పి విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లోని వీఐపీ లాంజ్ లో వెయిట్ చేస్తున్న జగన్ ను వెయిటర్ శ్రీనివాస్ టీ ఇస్తూ పలకరించాడు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో 160 సీట్లు వస్తాయా సార్ అంటూ పలకరించాడు. సెల్ఫీ దిగుతాను సార్ అంటూ చెప్పి తాను వెంట తెచ్చుకున్న కత్తితో జగన్ భుజంపై దాడి చేశాడు.
 
నిందితుడు శ్రీనివాస్ ను దాడి చేసిన వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం శ్రీనివాస్ ను విశాఖపట్నం పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ ను విచారించారు. విశాఖపట్నం సీపీ నవీన్ చంద్ర లడ్డా కేసు పురోగతిపై వివరాలు వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్ ను కోర్టుకు తరలించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్