నెల్లూరు: నెల్లూరు జిల్లా  వైసీపీ వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవిని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కట్టబెడుతూ వైసీపీ నిర్ణయం తీసుకొంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీని వీడి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరారు.  అయితే  వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుండి ఆనం భావిస్తున్నారు.ఈ మేరకు  వెంకటగిరి వైసీపీ అసెంబ్లీ  కో ఆర్డినేటర్ గా ఆనం రామనారాయణరెడ్డిని నియమిస్తూ  ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. 

ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో టీడీపీ కూడ వైసీపీలోని అసంతృప్తులను తమ వైపుకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నెల్లూరు మాజీ జడ్పీ ఛైర్మెన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని టీడీపీలో చేర్చుకోనుంది.  ఈ నెల 6వ తేదీన రాఘవేందర్ రెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు

వైసీపీలోకి ఆనం.. ఆ వర్గంలో చిచ్చు

వైసీపీలో చేరిన మాజీమంత్రి ఆనం

అది జగన్ ఇష్టం, దేనికైనా రెఢీ: ఆనం

డేట్ కన్ఫామ్ కావడంతో.. జోష్ లో ఆనం

స్పెన్స్ కి తెరదించిన ఆనం... తర్వాత నేదురుమల్లి

ఆనం సోదరుల ఎఫెక్ట్.. చల్లాకి పదవి