సెప్టెంబర్ లో ఆయన పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. వైసీపీలో చేరితే.. ఆయనకు సీటు లభించడం కూడా ఖాయమని తెలుస్తోంది. 

ఆనం రామనారాయణ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు రావడంలేదనే కారణంతో టీడీపీ ని వీడిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన టీడీపీ ని వీడిన నాటి నుంచి వైసీపీలోకి ఎప్పుడు చేరతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా.. సెప్టెంబర్ లో ఆయన పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. వైసీపీలో చేరితే.. ఆయనకు సీటు లభించడం కూడా ఖాయమని తెలుస్తోంది.

ఇక వైసీపీలో చేరేందుకు డేట్ కన్ఫామ్ కావడంతో.. ఆనం రామనారాయణ రెడ్డిలో జోష్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. సెప్టెంబర్‌ 2వ తేదీన తను పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. వైసీపీలో చేరే తేదీ ఖరారు చేసుకున్న క్రమంలో ఆనం జిల్లాలోని వైసీపీ నాయకులను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. 

ఆ పార్టీ శాసన సభ్యులు, ఎంపీ, ఇతర ముఖ్య నాయకులను వ్యక్తిగతంగా కలిసి తనకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. అలాగే 2వ తేదీ విశాఖపట్నంలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థనరెడ్డిని కలిశారు. గురువారం మరికొంత మంది ముఖ్యులతో మాట్లాడారు.

సస్పెన్స్ కి తెరదించిన ఆనం... తర్వాత నేదురుమల్లి

ఆనం సోదరుల ఎఫెక్ట్.. చల్లాకి పదవి