Asianet News TeluguAsianet News Telugu

అది జగన్ ఇష్టం, దేనికైనా రెఢీ: ఆనం

సెప్టెంబర్ రెండో తేదీన  వైసీపీలో చేరుతున్నట్టు మాజీ మంత్రి ఆనం నారాయణరెడ్డి ప్రకటించారు.  ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయాన్ని వైఎస్ జగన్ నిర్ణయిస్తారని  ఆనం స్పష్టం చేశారు.

I will join in ysrcp on sep 2 says Anam ramanarayana reddy
Author
Nellore, First Published Aug 28, 2018, 1:46 PM IST

నిర్ణయిస్తారని  ఆనం స్పష్టం చేశారు.

టీడీపీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదనే ఉద్దేశ్యంతోనే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.  ఈ మేరకు  సెప్టెంబర్ రెండో తేదీన  వైసీపీలో చేరేందుకు ముహుర్తంగా నిర్ణయించుకొన్నారు.

విశాఖ జిల్లాలో ప్రస్తుతం వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతోంది.ఈ యాత్రలోనే జగన్ సమక్షంలోనే తాను టీడీపీని వీడి  వైసీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.  అయితే నెల్లూరు జిల్లాలోని  ఎక్కడి నుండి పోటీ చేయాలనే దానిపై వైసీపీ చీఫ్ జగన్  ఇష్టమన్నారు.

అసెంబ్లీకి పోటీ చేయాలా.. పార్లమెంట్ కు పోటీ చేయాలా అనే దానిపై  పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంటుందని ఆయన చెప్పారు. నెల్లూరులోని ఆత్మకూర్, వెంకటగిరితో పాటు నెల్లూరు రూరల్ స్థానాల్లో ఏదో స్థానం నుండి పోటీ చేయాలని ఆనం భావిస్తున్నారు. అయితే ఈ విషయమై వైసీపీ నాయకత్వంతో చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే ఆనం ఎక్కడి నుండొ పోటీ చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

మరో వైపు తాను ఏ స్థానం నుండి పోటీ చేయాలనే దానిపై  పార్టీ చీఫ్ జగన్ నిర్ణయం తీసుకొంటారని ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కుఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.

డేట్ కన్ఫామ్ కావడంతో.. జోష్ లో ఆనం

స్పెన్స్ కి తెరదించిన ఆనం... తర్వాత నేదురుమల్లి

ఆనం సోదరుల ఎఫెక్ట్.. చల్లాకి పదవి

Follow Us:
Download App:
  • android
  • ios