న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో ఆయన వేగం పెంచినట్లు కనిపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు శరద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లతో సమావేశమయ్యారు. 

కాంగ్రెసుపై గుర్రుగా ఉన్న బిఎస్పీ నేత మాయావతితోనూ ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెసుకు, బిఎస్పీకి మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఆయన మాయవతితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో మాయావతి కాస్తా మెతకబడినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై, బిజెపిపై, ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రంగా ధ్వజమెత్తిన చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబుకు మంగళవారంనాడు ఫోన్ చేసి మాట్లాడారు. అదే విధంగా ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు.  

ఎన్డీఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోల్ కతాలో జనవరి మొదటివారంలో తలపెట్టిన ర్యాలీకి చంద్రబాబును మమతా బెనర్జీ ఆహ్వానించారు. బిజెపి వ్యతిరేక పార్టీలను, శక్తులను ఒకే వేదిక మీదికి తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సిందిగా అఖిలేష్ యాదవ్ చంద్రబాబును కోరారు. 

దేశంలో లౌకికవాదం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంపై పోరు సాగించాలని ఆయన చంద్రబాబుతో అన్నారు. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు అఖిలేష్ యాదవ్ ఫోన్:ఎల్లుండి ఢిల్లీకి పయనం

ఏపీలో ఇంకా దాడులు జరుగుతాయ్: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

ఢిల్లీలో జాతీయ నేతలను కలిసిన చంద్రబాబు (ఫోటోలు)

హస్తినలో చంద్రబాబు బిజీబిజీ: జాతీయ మద్దతుకు ప్రయత్నం

నల్లధనం వెనక్కితెస్తామని చెప్పి ఆర్థిక నేరగాళ్లను దేశం దాటించలేదా:కేంద్రంపై చంద్రబాబు ఫైర్

కేంద్రంలో అంతా గుజరాతీలే, నచ్చని వాళ్లపై వేధింపులు: చంద్రబాబు

రేవంత్ రెడ్డిపై ఐటి దాడులు, రేపోమాపో నాపైనా జరగొచ్చు :చంద్రబాబు

వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం, వ్యతిరేక పార్టీలపై బీజేపీ వేధింపులు:చంద్రబాబు

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం