ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై ఏపీసీఎం చంద్రబాబు నాయుడ నిప్పులు చెరిగారు. ఏపీతోపాటు దేశంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు అమలు చెయ్యడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 

రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీఉండాలని పదేపదే చెప్పారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు అని నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయి దేశంలో జరుగుతుందనేది ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు ఎక్కడ ఉంటున్నాయో అక్కడ కేంద్రప్రభుత్వం అక్కడ వాలిపోతుంది. 

మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా అక్కడ అధికారయంత్రాంగాన్ని వినియోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలను బలహీన పరుస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. 

నల్లధనాన్ని వెలికి తీస్తానని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ కరెన్సీని ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు అని ప్రశ్నించారు. డిజిటల్ కరెన్సీని అందుబాటులోకీ తీసుకురావాలనుకున్నప్పుడు రూ.200, రూ.500 నోట్లు ఎందుకు తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. విదేశాల్లో నల్లధనాన్ని రప్పిస్తామని చెప్పారు. ప్రతీ అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.  

దేశంలోని ప్రతీ పౌరుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్యుడు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నాడు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వడంలో విఫలమైందని మండిపడుతున్నారు. విభజన హామీలను ఏ ఒక్కటికి కూడా పూర్తి స్థాయిలో అమలు చెయ్యలేదు. 

విభజన హామీలు అమలు చెయ్యాలంటూ ఢిల్లీకి 29 సార్లు తిరిగానని కానీ స్పందించలేదన్నారు. తాను రాజకీయ నైతిక విలువుల కలిగి ఉన్నవ్యక్తినని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్డీఏ భాగస్వామ్యంగానే ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. 

బీజేపీ వైసీపీతో తెరవెనుక రాజకీయం నడుపుతోందని మండిపడ్డారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు తెలపడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగిఉండటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తనపై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వైసీపీ ట్రాప్ లో పడ్డానంటూ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తాను వైసీపీ ట్రాప్ లో పడలేదని, నరేంద్రమోదీయే అవినీతి ట్రాప్ లో పడ్డారంటూ మండిపడ్డారు. కళంకిత నేతలతో బీజేపీ సఖ్యతగా నడుస్తోందని మండిపడ్డారు. 

పార్లమెంట్ లో తనకు మెచ్యూరిటీ లేదని వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్నమెచ్యూరిటీ తనకు లేదని వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమన్నారు. తన రాజకీయ అనుభవంతో పోల్చుకుంటే మోదీ ఎంత అంటు ప్రశ్నించారు. 2002లో నరేంద్రమోదీ ముఖ్యమంత్రి అయితే తాను 1995లోనే సీఎం అయ్యాననని గుర్తు చేశారు. ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది తానేనని చెప్పుకొచ్చారు.