అందుకే వారిని సెల్ చూడొద్దని చెప్పాం... గోరంట్ల మాధవ్ వీడియోపై నటుడు పృథ్వీరాజ్ ఫైర్...
దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదంటూ.. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మీద నటుడు పృథ్వీరాజ్ విరుచుకుపడ్డారు. తమ తల్లులు, చెల్లెల్లు సెల్ చూడొద్దని చెప్పామని చెప్పుకొచ్చారు.
విశాఖపట్నం : రాష్ట్ర ప్రజలు, అక్క చెల్లెలు, తల్లులు సెల్ ఫోన్లు చూడొద్దని మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ‘వాంటెడ్ పండుగాడు’ చిత్ర యూనిట్ గురువారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఎంపీ గోరంట్ల మాధవ్ దిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ స్పందించారు వరలక్ష్మీ వ్రతం ముందు రోజే వచ్చిన ఆ దరిద్రాన్ని తాను చూశానని అందుకే మిగిలిన వారిని చూడొద్దని చెప్పానని అన్నారు.
దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదన్నారు. పార్లమెంటు అంటే పవిత్ర దేవాలయమని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన సమరయోధులు ఎందరో అందులో కొలువై ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఉండాల్సిన చోట ఇలాంటి వారు ఉన్నారని విమర్శించారు. ‘ గతంలో వారం రోజుల పాటు నా మీద ప్రెస్ మీట్ పెట్టారు.. ఇప్పుడేవి?’ అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్ లేదన్నారు. ‘ అనంతపురం ఎస్.పి విలేకరుల సమావేశం పెడుతున్నట్లు ఆయనకు ఎలా తెలుసు? ఎస్పీ మాట్లాడుతున్నప్పుడే.. మాధవ్ ఢిల్లీలో మాట్లాడారు. ఇంగ్లాండ్ నుంచి అప్లోడ్ అయింది. ఎవరో చేశారు. ఒరిజినల్ క్లిప్ ను కనిపెట్టలేకపోయాం… అంటూ ఎస్పీ మాటలు చాలా దీనంగా ఉన్నాయి.
ఫోరెన్సిక్ నిపుణులు అరగంటలో వాస్తవం తేలుస్తారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూనే ఫేక్ అని తేల్చేశారు. వాళ్ల కోర్టులో అది ఫేక్ దేనని తేలుతుంది. అంతకుమించి వేరే ఏమి రాదు. ఆయన పృద్వి కాదు కదా.. మాకు అంగ బలం అర్ద బలం ఉంటే.. అద్భుతం అంటారు’ అని పృథ్వీరాజ్ వివరించారు.
ఇదిలా ఉండగా, నగ్న వీడియో ప్రసారం చేశారంటూ అసభ్య పదజాలంతో వ్యక్తిగత దూషణలకు దిగిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీద న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిర్ణయించుకున్నారు. గోరంట్ల మాధవ్ మీద రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నారు. ఆయనపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 4వ తేదీ ఉదయం నుంచి గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మాధవ్ వీడియోని ఆ ల్యాబ్‌లో టెస్ట్ చేయండి.. జాతీయ మహిళా కమీషన్‌కు వంగలపూడి అనిత లేఖ
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహా పలు మీడియా సంస్థలు దీనిమీద కథనాలు ప్రసారం చేశాయి. అదే రోజు మీడియా ముందుకు వచ్చిన ఎంపీ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీని అసభ్య పదజాలంతో దూషించారు. బుధవారం మరోసారి ఇదే రీతిలో మాట్లాడారు. దీంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ నిర్ణయించుకున్నారు. కాగా, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందినదిగా ప్రచారం జరుగుతున్న వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం పోలీసులు బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.