Andhra Pradesh18, Feb 2019, 2:58 PM IST
దమ్ముంటే భీమిలి నుంచి పోటీ చేయ్ : వైఎస్ జగన్ కు మంత్రి గంటా సవాల్
వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జగన్ కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలన్నారు. జగన్ పోటీ చేసినా, ఎవరు పోటీ చేసినా తాను గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh16, Feb 2019, 5:35 PM IST
జగన్ కి భయపడే 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నావ్: చంద్రబాబుపై అవంతి ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే భయపడనని అలాంటిది చంద్రబాబుకు భయపడతానా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం బలాన్ని చూసి భయపడ్డ చంద్రబాబు వైసీపీ నుంచి గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నారని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలను భ్రష్టుపట్టించారంటూ ధ్వజమెత్తారు.
Andhra Pradesh16, Feb 2019, 5:23 PM IST
గంటా పాము, లోకేష్! జాగ్రత్త: అవంతి సంచనల వ్యాఖ్యలు
గంటా అసలు స్వరూపం మీకు తెలియదని మంత్రి అయ్యన్న పాత్రుడుని అడిగితే చెప్తారని చెప్పుకొచ్చారు. గంటా అనే పాముని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నమ్మించి మోసం చెయ్యడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరితేరిపోయారని విమర్శించారు.
Andhra Pradesh14, Feb 2019, 1:49 PM IST
టీడీపికి అవంతి రాజీనామా: సబ్బం హరికి లైన్ క్లియర్
అయితే 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. మళ్లీ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్లు ప్రకటించారు ఆయనే సబ్బం హరి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో దిగుతానని స్పష్టం చేశారు. అలా ప్రకటించారో లేదో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఓ రేంజ్ లో పొగడటం మెుదలుపెట్టారు.
Andhra Pradesh14, Feb 2019, 10:07 AM IST
చంద్రబాబుకు మరో షాక్: వైసీపీలోకి అవంతి, ముహూర్తం ఖరారు
ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా సమాచారం. ఇకపోతే అటు విశాఖపట్నంలోని ఆయన నివాసం దగ్గర తెలుగుదేశం పార్టీ జెండాలను సైతం తొలగించినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను సైతం వెనక్కి పంపించినట్లు సమాచారం. అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు.
Andhra Pradesh13, Feb 2019, 9:07 PM IST
టీడీపీకి మరోషాక్: వైసీపీలోకి సిట్టింగ్ ఎంపీ..?
ఇకపోతే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని ప్రచారం జరుగుతుంది. మరోవైపు జనసేనకు చెందిన నేతలు కూడా అవంతి శ్రీనివాస్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం.
Telangana13, Feb 2019, 8:46 PM IST
కేసీఆర్ ఏపీ పర్యటన రద్దు, విశాఖకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఇకపోతే గురువారం విశాఖపట్నంలోని శారద పీఠంలో నిర్వహించనున్న రాజశ్యామల యాగానికి సీఎం కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది. అయితే రాజశ్యామల యాగానికి సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదని శారదపీఠం నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. అయితే కేసీఆర్ తరఫున రాజశ్యామల యాగానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh9, Feb 2019, 7:43 PM IST
మంత్రి కొడుకు ఓవర్ యాక్షన్: టీడీపీకే ఓటేస్తామంటూ లబ్ధిదారులతో గుడిలో ప్రమాణం
అంతటితో ఆగిపోలేదు అనకాపల్లిలోని 26వ వార్డులో ఉన్నఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్లి లబ్ధిదారులందరి చేత ప్రమాణం చేయించారు. తాము ఎలాంటి ప్రలోభాలకు లొంగమని చంద్రబాబు నాయుడు ఇచ్చిన రూ.10వేలుకు కృతజ్ఞతగా తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తామంటూ ప్రమాణం చేయించారు మంత్రిగారి సుపుత్రుడు.
Andhra Pradesh9, Feb 2019, 11:30 AM IST
చెక్ బౌన్స్: టీడీపి ఎమ్మెల్యే అనితకు కోర్టు సమన్లు
నిరుడు జూలై 30న రూ.70 లక్షల హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను అనిత ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేస్తే అకౌంట్లో బ్యాలెన్స్ లేదని బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు లేఖ పంపారు.
Telangana29, Jan 2019, 10:44 AM IST
మరోసారి విశాఖకు కేసీఆర్.. శారదాపీఠం నుంచి ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు మరోసారి విశాఖ వెళ్లనున్నారు. నగరంలోని శారదాపీఠంలో ఫిబ్రవరి 14న జరగనున్న అమ్మవారి విగ్రహావిష్కరణ కార్యక్రామానికి హాజరుకావాల్సిందిగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.. కేసీఆర్ను ఆహ్వానించారు.
Andhra Pradesh26, Jan 2019, 1:26 PM IST
మీకు దండం పెడతా, ఆ పని మాత్రం చెయ్యొద్దు: పవన్ కళ్యాణ్
వన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సింది ఓట్లు మాత్రమేనని ప్రాణాలు కాదన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారంలో బైక్ లపై వేగంగా వెళ్లొద్దన్నారు. గాయాల పాలవ్వొద్దని సూచించారు. గాయాలైతే ఓట్లు వేసేది ఎవరని ప్రశ్నించారు.
Andhra Pradesh26, Jan 2019, 1:13 PM IST
తన పోటీపై మరో మాట చెప్పిన పవన్ కల్యాణ్
ఈ సందర్భంలో పలువురు కార్యకర్తలు గాజువాక నుంచి పోటీ చెయ్యాలంటూ నినాదాలు చేశారు. భగవంతుడి ఆదేశిస్తే అక్కడ నుంచే పోటీ చేస్తానని కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. తాను ఎంపీ కావాలనో, ఎమ్మెల్యే కావాలనో రాజకీయాల్లోకి రాలేదన్నారు.
Andhra Pradesh26, Jan 2019, 10:20 AM IST
జగన్ పై దాడి కేసు: శ్రీనివాసరావు కోర్కెల చిట్టా ఇదీ.......
‘నన్ను సాధారణ ఖైదీలా చూస్తున్నారు. జైల్లో పెద్దపెద్ద కేసుల్లో ఉన్న ఖైదీలంతా నా వెనుక అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది’ అని శ్రీనివాసరావు న్యాయమూర్తి ఎదుట శ్రీనివాసరావు వాపోయారు.
Andhra Pradesh25, Jan 2019, 2:59 PM IST
లెఫ్ట్ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం (ఫొటోలు)
లెఫ్ట్ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం (ఫొటోలు)
Andhra Pradesh22, Jan 2019, 3:12 PM IST
ఓడిపోతే ఇంట్లో కూర్చుంటా, పార్టీ మారే ప్రసక్తే లేదు
బీజేపీ చిన్న పార్టీ కాదని అతిపెద్ద పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో 40 లక్షల మంది సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.