తన తమ్ముడిని బలిచేశారంటూ.. జగన్ పై దాడి కేసులో నిందితుడు అక్క రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల 25వ తేదీన వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాడి జరిగిన నాటి నుంచి నిందితుడు పోలీసుల రిమాండ్ లోనే ఉన్నాడు. కాగా.. తన తమ్ముడిని చంపేస్తున్నారంటూ అతని సోదరి ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ పై జరిగిన దాడి గురించి ఆమె మాట్లాడుతూ...‘‘ జగన్ పై నా తమ్ముడితో ఎవరో కావాలనే దాడి చేయించారు. ఎవరు చేయించారో చెబితే.. వాళ్లు నా తమ్ముడిని చంపేస్తామని బెదిరించి ఉంటారు. అందుకే వాడు చెప్పడం లేదేమో. డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఈ పని చేయించి ఉంటారు. దీంతో.. ఆ డబ్బుతో భూమి కొందామని అనుకొని ఉంటాడు. అందుకే వాళ్లు చెప్పినట్లు చేశాడేమో’’ అని రత్నకుమారి తెలిపారు.

‘‘ నా తమ్ముడి చేతిలో రూపాయి లేదు. అలాంటి వాడు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని మేము ఊహించలేదు. ఈ పనికి పురమాయించిన వారు ఇప్పుడు వాడిని చంపేస్తారేమోననే భయం మా అందర్నీ వెంటాడుతోంది. నా తమ్ముడు ఇంతటి నేరం చేశాడంటే నమ్మలేకపోతున్నా. ఇందుకు కారకులైన వారు ఇప్పుడు నా తమ్ముడిని ఏమి చేస్తారో. వాడు ఏమైపోతాడోనని ఆందోళనగా ఉంది. ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు ఇలా బలైపోయాడు.’’

‘‘ ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. ఇక వాడిని వాళ్లు పట్టించుకోరు. విశాఖపట్నం వెళ్లిన తరువాతే అలా అయ్యాడు. ఆ టైంలో ఏమైనా ఇప్పుడు వాడు నిజం చెప్పడానికి లేదు. బాగా భయపెట్టి ఉంటారు. నేను కళ్లారా చూసే దానిని. వాడు చిన్న ఫోన్‌ వాడే వాడు. మరి తొమ్మిది ఫోన్‌లు మార్చాడంటే నమ్మలేకపోతున్నాను. ప్రాణహాని ఉందని పోలీసులు తీసుకు వెళుతున్నప్పుడు చెబుతుంటే... టీవీల్లో చూసి మాకు గుండె ఆగినంత పనైంది.’’ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

read more news

జగన్ మీద దాడిపై జేసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌ కత్తి ఎలా తీసుకెళ్లాడంటే?

జగన్‌కేసు దర్యాప్తు: శ్రీనివాస్ దుబాయ్‌లో వెల్డర్, హైద్రాబాద్‌లో కుక్

జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్: ఆ యువతులే కీలకం

జగన్‌పై దాడి కేసు...శ్రీనివాస్‌ మళ్లీ జైలుకే

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు