కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు: హరీష్ రావుతో ఈటల రాజేందర్ కు చెక్

By telugu teamFirst Published Sep 9, 2019, 4:54 PM IST
Highlights

కేసీఆర్ కు గులాబీ ఓనర్ల చిక్కు ప్రారంభమైంది. ఈటల రాజేందర్ చేసిన ఆ వ్యాఖ్యను ఇతర అసంతృప్త నాయకులు కూడా వాడుకుంటున్నారు. తాజాగా నాయిని నర్సింహా రెడ్డి తాను కూడా గులాబీ ఓనర్ నే అని చెప్పుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు గులాబీ ఓనర్ల చిక్కులు ప్రారంభమయ్యాయి. ఏ క్షణాన మంత్రి ఈటల రాజేందర్ తామే గులాబీ ఓనర్లమని అన్నారో ఆ పదం టీఆర్ఎస్ రాజకీయాల్లో స్థిరపడిపోయింది. తాజాగా, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తాను కూడా గులాబీ ఓనర్ నని ప్రకటించుకున్నారు. 

కేసీఆర్ పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి గులాబీ ఓనర్ అనే పదాన్ని నాయకులు ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది. గులాబీ ఓనర్ అనే పదం అంత సంచలనంగా మారడానికి కారణం లేకపోలేదు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి దానికి ప్రాముఖ్యాన్ని సంతరించిపెట్టింది. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినవారిని కేసీఆర్ తీసుకుంటూ, వారికి పదవులు అప్పగిస్తూ వస్తున్నారు. ఇతర పార్టీల నాయకులను కూడా చేర్చుకుంటూ మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారిని పక్కన పెడుతూ వస్తున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ మొదలు సబితా ఇంద్రారెడ్డి వరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇవ్వడమే కాకుండా ఇతరత్రా ముఖ్య భూమికలను ఇస్తూ వస్తున్నారు. 

శాసనసభ ఎన్నికల తర్వాత పక్కన పెట్టిన తన మేనల్లుడు, సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చారు. ఈ స్థితిలో బాహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని విరివిగానే ప్రచారం సాగింది. అయితే, కేసీఆర్ ఆ పనిచేయలేదు. అయితే, హరీష్ రావు ద్వారా రాజేందర్ కు చెక్ పెట్టినట్లు మాత్రం అర్థం చేసుకోవచ్చు.

టీఆర్ఎస్ లో హరీష్ రావు, ఈటల రాజేందర్ ఒక వర్గం అనే ప్రచారం కొనసాగుతూ వచ్చింది. ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన హరీష్ రావును తిరిగి తన గూటికి చేర్చుకోవడం వల్ల ఈటల రాజేందర్ తో ముప్పు తక్కువే ఉంటుందని కేసీఆర్ భావించి ఉంటారని అనుకోవచ్చు. పైగా, మంత్రి పదవి నుంచి తొలగించలేదు కాబట్టి మరో రకంగా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కూడా వీలుండదని ఆయన అనుకుని ఉంటారు. 

ఇదే సమయంలో పలువురు సీనియర్లకు కార్పోరేషన్ చైర్మెన్ పదవులు, ఉన్నత పదవులు ఇస్తామని టీఆర్ఎస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మంత్రిగా పనిచేసిన తాను కార్పోరేషన్ చైర్మన్ పదవిని ఎలా తీసుకుంటానని నాయిని నర్సింహా రెడ్డి ప్రశ్నించారు. ఇదే విధమైన భావనకు జూపల్లి కృష్ణారావు, మధుసూదనాచారి వంటి నాయకులు కూడా వ్యక్తం చేసే అవకాశాలు లేకపోలేదు. 

కడియం శ్రీహరి వంటి కొందరికి ఉన్నత పదవులు ఇస్తామని చెప్పారు. ఆ పదవులేమిటో చెప్పలేదు. కేసీఆర్ ఇచ్చే ఆ పదవులకు నాయకులు అంగీకరిస్తారా అనేది వేచి చూడాల్సింది. అయితే, టీఆర్ఎస్ లో ఈ పరిస్థితి రావడానికి, అంటే కేసీఆర్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసే స్థాయి ఎందుకు వచ్చిందనేది ప్రశ్నించుకుంటే, అది బిజెపి ప్రభావమేనని చెప్పవచ్చు. 

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇంత వరకు టీఆర్ఎస్ మాత్రమే తమకు అనువైన పార్టీగా కనిపిస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ రెండు పార్టీల నేతలకు మాత్రమే కాకుండా టీఆర్ఎస్ నేతలకు కూడా బిజెపి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఇదే కేసీఆర్ కు పెద్ద చిక్కుగా పరిణమించింది.

సంబంధిత వార్తలు

మంత్రి ఈటల రాజేందర్ కు షాక్: బిఎసి నుంచి తొలగింపు

ఆ పదవి నేను చేస్తానా: కేసీఆర్‌కి నాయిని నర్సింహారెడ్డి సెగ

ముంచుకొస్తున్న ముప్పు: మంత్రివర్గ విస్తరణపై మారిన కేసీఆర్ ప్లాన్

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

హరీష్ కు మంత్రిపదవి: కేసీఆర్ కు తప్పలేదా, వ్యూహమా?

హరీష్‌కు పెద్దపీట: కొత్త మంత్రుల శాఖలివే

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలిసారి కేబినెట్‌లోకి

కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ: తొలుత హరీష్, చివరగా పువ్వాడ

టీఆర్ఎస్‌లో ట్రబుల్ షూటర్: రికార్డుల విజేత హరీష్ రావు

భర్త మరణంతో రాజకీయాల్లోకి.. మూడోసారి మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి

టీఆర్ఎస్‌లో కీలకనేతగా కేటీఆర్: మెడిసిన్‌ కాదని ఐటీ వైపు

బీజేపీ దూకుడు: చెక్ పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ ఇదీ..

బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

click me!