హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు

Published : Sep 29, 2019, 02:29 PM ISTUpdated : Sep 29, 2019, 02:33 PM IST
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు: సీపీఎం అభ్యర్ధి పారేపల్లి శేఖర్ రావు

సారాంశం

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఎం నిర్ణయం తీసుకొంది. 


హుజూర్‌నగర్: హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 21న జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్ రావు పేరును సీపీఎం ఆదివారం నాడు ప్రకటించింది.

2018 డిసెండర్ 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికల్లో కూడ హుజూర్‌నగర్  స్థానంలో సీపీఎం పోటీ చేసింది. ఆ సమయంలో కూడ పారేపల్లి శేఖర్ రావును సీపీఎం బరిలోకి దించింది.

ఆ ఎన్నికల్లో  సీపీఎంకు 2121 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి భాగ్యారెడ్డికి 1555 ఓట్లు వస్తే, నోటాకు 1621 ఓట్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 21న జరిగే ఉప ఎన్నికల్లో సీపీఎం కూడ బరిలోకి దిగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన శేఖర్ రావును మరోసారి ఆ పార్టీ బరిలోకి దింపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడ  సీపీఎంకుఈ నియోజకవర్గంలో 2121 ఓట్లు వచ్చాయి.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి తాము పోటీ చేస్తున్నట్టుగా సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.1967లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం నుండి డి. నరసయ్య సీపీఎం అభ్యర్ధిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు.

ఈ నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంకు గతంలో గణనీయమైన ఓట్లుండేవి. ఈ పార్టీల ప్రభావం ఇంకా కూడ ఈ నియోజకవర్గంపై ఉంటుంది. ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములను ఈ పార్టీలు ప్రభావితం చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు:

హుజూర్‌నగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్‌కి వేసినట్లే.. లక్ష్మణ్ వ్యాఖ్యలు

కేసీఆర్ హుజూర్ నగర్ వ్యూహం: ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకాకి

వీకెండ్: హుజూర్ కోసం పోరు, అజరుద్దీన్ తో వివేక్ కు కేటీఆర్ చెక్

2011 బాన్సువాడ నిర్ణయం: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ సై

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్: సర్పంచుల సంఘం అధ్యక్షుడు మిస్సింగ్?

హుజూర్ నగర్ పై చంద్రబాబు మంతనాలు: ఉత్తమ్ కు షాక్?

కోదాడలో చెల్లని పైసా హుజూర్ నగర్ లో చెల్లుతుందా: ఉత్తమ్ పై కర్నె ప్రభాకర్ ధ్వజం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లకు షాక్: హుజూర్‌నగర్ బరిలో 30 మంది లాయర్లు

ట్రక్కు లేకపోతే ఉత్తమ్ అప్పుడే ఓడిపోయేవారు: కేటీఆర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్