
హైదరాబాద్: డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 45 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలంతా నిర్విరామంగా పనిచేయనున్నారు. నాలుగు టీమ్‌లు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నాయి.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో చర్చించారు. బుధవారం నాడు టీపీసీసీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. తెలంగాణలో రాహుల్, సోనియా గాంధీ సభలతో పాటు ప్రచారాంశాలు ఇతర విషయాలపై చర్చించారు.
పీసీసీ స్థాయి నాయకులు ఖచ్చితంగా ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించాలని కుంతియా పార్టీ నేతలకు సూచించారు. నవంబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రచారం ఎలా నిర్వహించాలి.. ప్రత్యర్థుల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే దానిపై కార్యకర్తలకు తర్పీదు ఇస్తారు.
అక్టోబర్ 28వ తేదీన పార్టీ అధికార ప్రతినిధులకు శిక్షణఫ ఇవ్వనున్నారు. మీడియా సమావేశాల్లో ప్రత్యర్థులపై విమర్శలను ఎలా ధీటుగా సమాధానం చెప్పాలనే విషయాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
నాలుగు టీమ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తాయి. మాజీ మంత్రి జానారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్ల భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ టీమ్ లు పనిచేస్తాయి.ప్రతి ఒక్క కార్యకర్త 45 రోజుల పాటు కష్టపడి పని చేయాలని... ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదని కుంతియా పార్టీ నేతలకు తేల్చి చెప్పేశారు.
సంబంధిత వార్తలు
ప్రైవేట్ రంగంలో కూడ లక్ష ఉద్యోగాలు: ఉత్తమ్ బంపర్ ఆఫర్
రాహుల్ చేసిన ఆ పనిని కేసీఆర్ చేయలేకపోయారు: ఉత్తమ్
బైంసాకు చేరుకున్న రాహుల్ గాంధీ...
తెలంగాణలో రాహుల్ పర్యటన ఇలా సాగనుంది...
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు
కాంగ్రెస్‌కు షాక్: రాహుల్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
తెలంగాణలో రాహుల్ టూర్: అక్టోబర్ 20న మూడు సభలు
మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు
మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?
మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ
మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్
మహా కొలిమి: కోదండరామ్ కొర్రీలు
నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్
మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు
మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక
మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి
వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్
కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్ కరుణించేనా?