పెళ్లి వేడుక వీడియోను షేర్ చేసిన సోదరి: సానియా ఫన్నీ కామెంట్‌, వైరల్

By Siva KodatiFirst Published Apr 8, 2020, 4:36 PM IST
Highlights

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహం టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. రెండు రిసెప్షన్లతో మూడు రోజుల పాటు జరిగిన వేడుకలు అభిమానులను ఎంతగానో అలరించాయి. 

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా వివాహం టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్‌తో గతేడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. రెండు రిసెప్షన్లతో మూడు రోజుల పాటు జరిగిన వేడుకలు అభిమానులను ఎంతగానో అలరించాయి.

ఈ క్రమంలో మంగళవారం ఆనం పెళ్లి సందర్భంగా తెర వెనుక జరిగిన ఏర్పాట్లను ఇద్దరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన కామెంట్ అభిమానులకు నవ్వులను పంచింది.

Also Read:హాఫ్ కరోనా ట్రోల్స్... గుత్తా జ్వాల స్ట్రాంగ్ కౌంటర్

ఈ ఉదయం ఆనం మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. హౌస్‌ఫుల్ 4 లో ఫేమస్ అయిన పాటకు డ్యాన్స్ చేస్తుండగా పెద్ద సంఖ్యలో స్నేహితులు, కుటుంబసభ్యులు గుమిగూడి ఉన్నారు.

దీనిపై కామెంట్ చేయాల్సిందిగా ఆనమ్ కోరింది. ఈ సందర్భంగా సానియా మీర్జా చేసిన కామెంట్ అభిమానులను నవ్వుల్లో ముంచెత్తింది. ‘‘సోషల్ డిస్టెన్సింగ్’’ అంటూ సానియా కామెంట్ చేసింది.

Also Read:సచిన్, సెహ్వాగ్ లకు ఆల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో స్థానం కల్పించిన షేన్ వార్న్

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో పాటు ప్రజలు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెప్తుండటంతో సానియా ఈ విధంగా కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది.  టెన్నిస్ స్టార్ కామెంట్ చేసిన గంటలోనే ఈ పోస్ట్‌ను వేలాది మంది లైక్ చేశారు.

‘‘ సోషల్ డిస్టెన్సింగ్ 2020 అంటూ కొందరు స్మైలింగ్ ఎమోజీని జత చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనల ప్రకారం.. మీ సమీపంలో ఎవరైనా దగ్గు, తుమ్ము వున్న వారికి ఆరు అడుగుల దూరం పాటించాలి. ఎవరైనా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వారి ముక్కు, నోటి నుంచి చిన్న చిన్న తుంపర్లు గాలిలోకి ప్రవేశిస్తాయి. వాటిలో వైరస్ ఉండే అవకాశాలను కొట్టిపారేయలేం. 

 

click me!