IPL 2024 DC vs MI : తెలుగోడి పోరాటం వృధా... ముంబై పై డిల్లీ అద్భుత విజయం 

By Arun Kumar P  |  First Published Apr 27, 2024, 8:09 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో మరో హై స్కోరింగ్ మ్యాచ్ పూర్తయింది. డిల్లీ క్యాపిటల్స్  సొంత గడ్డపై భాారీ స్కోరు బాదగా... ముంబై కూడా తామేమీ తక్కువ కాదన్నట్లు పోరాడింది. కానీ చివర్లో జరిగిందిదే... 


డిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో అద్భుత మ్యాచ్ కు దేశ రాజధాని డిల్లీ వేదికయ్యింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో లోకల్ టీం డిల్లీ కేపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య   హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరులో చివరకు డిల్లీదే పైచేయిగా నిలిచింది. భారీ స్కోరును చేధించినంత పని చేసినా ముంబై విజయ తీరాలకు కాస్త దూరంలో నిలిచింది.

డిల్లీ విసిరిన 258 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు శుభారంభం అందించలేకపోయారు. హిట్ మ్యాచ్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులకే ఔట్ అయ్యారు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 20 పరుగుల వద్ద ఔటయ్యాడు. సూర్యకూమర్ యాదవ్ 26 పరుగులకే పరిమితం అయ్యాడు. ఇలా 65 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ముంబైని తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి ఆదుకునే ప్రయత్నం చేసాడు. 

Latest Videos

కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు తిలక్. 46 పరుగులుతో హాఫ్ సెంచరీకి చేరువైన పాండ్యా ఔటయ్యాడు. ఆ తర్వాత  టిమ్ హెడ్ తో కలిసి మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు తిలక్. డేవిడ్ ధనా ధన్ ఇన్సింగ్స్ (17 బంతుల్లో 37 పరుగులు), తిలక్ వర్మ వీరోచిత పోరాటం (32 బంతుల్లో 63 పరుగులు)తో ముంబై ఇండియన్స్ విజయంపై ఆశలు చిగురించాయి. కానీ చివర్లో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో ముంబై స్కోరు 247 కే పరిమితం అయ్యింది. 10 పరుగుల తేడాతో డిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 

డిల్లీ బ్యాటింగ్ అదుర్స్ : 

మొదట బ్యాటింగ్ చేసిన డిల్లీ అదరగొట్టింది. ముంబై బౌలర్లను ఉతికారేసిన జేక్ ఫ్రాసర్ మెక్ గర్క్ కేవలం 27 బంతుల్లోనే 84 పరుగులు చేసాడు. అతడి బ్యాటింగ్ చూస్తుంటే అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదేలా కనిపించాడు. కానీ ముంబై బౌలర్ చావ్లా బౌలింగ్ లో గర్క్  ఔటయ్యాడు. అతడు అందించిన ఆరంభాన్ని డిసి కంటిన్యూ చేసింది.  మరో ఓపెనర్ అభిషేక్ పారెల్ 27 బంతుల్లో 36 పరుగులు చేసాడు.  హోప్స్ 17 బంతుల్లో 41, కెప్టెన్ రిషబ్ పంత్ 19 బంతుల్లో 29, స్టబ్స్ 25 బంతుల్లో 48 పరుగులతో అదరగొట్టారు. దీంతో డిల్లీ టీం 257 పరుగులు భారీ స్కోరు సాధించింది. 

click me!