Asianet News TeluguAsianet News Telugu

సచిన్, సెహ్వాగ్ లకు ఆల్ టైం గ్రేటెస్ట్ ఎలెవన్ లో స్థానం కల్పించిన షేన్ వార్న్

స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్, తన వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో భారత స్టార్స్‌కు చోటు కల్పించాడు. షేన్‌ వార్న్‌ తాను కెరీర్‌లో ఎదుర్కొన్న ప్రత్యర్థి జట్ల నుంచి అత్యంత ప్రతిభావంతమైన, క్రికెట్ గతిని మార్చివేయగల ప్లేయర్స్ లోనుంచి తన వరల్డ్‌ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. 

Tendulkar, Sehwag included in Shane Warne's greatest World ODI XI
Author
Sydney NSW, First Published Apr 8, 2020, 8:41 AM IST

కరోనా వైరస్ రక్కసి, లాక్ డౌన్ ల వల్ల ఎవరు కూడా ఇండ్లలోంచి కాలు బయటపెట్టే సాహసం చేయలేకపోతున్నారు. సెలెబ్రిటీలు అంతా ఏ దేశంవారైనాప్రజలందరిని ఇండ్లలో ఉండమని సూచిస్తున్నారు. 

తాజాగా ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కరోనా నేపథ్యంలో ఎక్కడికి బయటకు వెళ్లలేక తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు. ఆ సందర్భంగా తనకు నచ్చిన వరల్డ్ ఎలెవన్ జట్టును ఎంచుకున్నాడు. 

ఇక ఈ స్పిన్‌ దిగ్గజం షేన్ వార్న్, తన వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో భారత స్టార్స్‌కు చోటు కల్పించాడు. షేన్‌ వార్న్‌ తాను కెరీర్‌లో ఎదుర్కొన్న ప్రత్యర్థి జట్ల నుంచి అత్యంత ప్రతిభావంతమైన, క్రికెట్ గతిని మార్చివేయగల ప్లేయర్స్ లోనుంచి తన వరల్డ్‌ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. 

సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేన్‌ వార్న్‌ మంగళవారం అభిమానులతో లైవ్‌ సెషన్‌లో పాలు పంచుకున్నాడు. అభిమానులు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. తన క్రికెట్ అనుభవాల నుండి మొదలు పర్సనల్ లైఫ్ వరకు అనేక విషయాలను పంచుకున్నాడు. 

కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే, ఇంకేమైనా ఉందా.. ఐపీఎల్‌లో ఉండరేమోనని: మైఖేల్ క్లార్క్

ఈ సందర్భంగా తన వరల్డ్‌ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. ప్రత్యర్థి జట్టులో తాను బౌలింగ్ వేయడానికి కొన్నిసార్లు భయపడ్డ బ్యాట్స్ మెన్ దగ్గరి నుండి తన బొయిలింగ్ ని ఉతికి ఆరేసిన బ్యాట్స్ మెన్ వరకు రకరకాలుగా ఎంచుకున్నాడు. 

ఇక బౌలర్లను ఎంచుకునేటప్పుడు అత్యంత ప్రభావశీల బౌలర్లను, మ్యాచ్ గతిని తమ బౌలింగ్ సామర్థ్యంతో తమ ఆధీనంలోకి తెచ్చుకోగలవారందరినీ ఆయన తన టీం లో ఎంచుకున్నాడు. 

ఆస్ట్రేలియాకు 194 వన్డేల్లో ప్రాతినిథ్యం వహించైనా షేన్ వార్న్, 1999 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌ విజయంలో ముఖ్య భూమిక వహించాడు. ఆ వరల్డ్‌కప్‌లో 20 వికెట్లు కూల్చిన వార్న్‌, ఫైనల్లో పాకిస్థాన్‌పై 4/33 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 

ఓ వరల్డ్‌కప్‌ ఫైనల్లో స్పిన్నర్‌కు ఇదే ఉత్తమ ప్రదర్శన. ఐపీఎల్‌లోనూ రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌, మెంటర్‌గా షేన్‌ వార్న్‌ 2008లో తొట్ట తొలి టైటిల్‌ను జట్టుకు అందించాడు. 

షేన్‌ వార్న్‌ వరల్డ్‌ ఎలెవన్‌ : వీరెందర్‌ సెహ్వాగ్‌, సనత్‌ జయసూర్య, సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా, కెవిన్‌ పీటర్సన్‌, కుమార సంగక్కర (వికెట్‌ కీపర్‌), అండ్రూ ఫ్లింటాఫ్‌, వసీం అక్రమ్‌, డానియల్‌ వెటోరి, షోయబ్‌ అక్తర్‌, కర్ట్లీ ఆంబ్రోస్‌.

Follow Us:
Download App:
  • android
  • ios