హాఫ్ కరోనా ట్రోల్స్... గుత్తా జ్వాల స్ట్రాంగ్ కౌంటర్

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యాక తనను కొందరు నెటిజన్లు హాప్‌ కరోనా, చైనాకా మాల్‌, హాఫ్‌ చైనీస్‌, చింకీ అని పిలవడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు కాగా నా తండ్రి తెలుగువాడని ఆమె చెప్పారు.

Educated lot is jogging on roads and blaming one community for spreading coronavirus: Jwala Gutta

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలను గత కొద్ది రోజులుగా నెటిజన్లు  హాఫ్ కరోనా పేరిట ట్రోల్ చేస్తున్నారు. కాగా.. తనపై వస్తున్న ట్రోల్స్ కి ఆమె తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై వస్తున్న ట్రోల్స్ ని ఆమె జాత్యహంకార చర్యగా అభివర్ణించారు. 

Also Read కోహ్లీకి ఫెదరర్ ఛాలెంజ్.. ఆట అదిరింది...

తాను సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటానని ఆమె అన్నారు. ఈ క్రమంలో గతంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ అమ్మాయిపై ఉమ్మేశారని.. ఆ వీడియో వైరల్‌ అవ్వడంతో.. తాను  వెంటనే దేశంలో జాత్యహంకారం పెరిగిపోయిందని కామెంట్‌ చేశానని చెప్పారు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యాక తనను కొందరు నెటిజన్లు హాప్‌ కరోనా, చైనాకా మాల్‌, హాఫ్‌ చైనీస్‌, చింకీ అని పిలవడం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎందుకుంటే నా తల్లి చైనా దేశస్థురాలు కాగా నా తండ్రి తెలుగువాడని ఆమె చెప్పారు. దీంతో.. తనను హాఫ్ కరోనా అని పిలుస్తున్నారని అది కూడా జాత్యాహంకార చర్యేనని ఆమె అన్నారు.

‘లాక్‌డౌన్‌లో ఉదయం లేవగానే చూస్తే మన(హైదరాబాద్‌) రోడ్లపై కొందరు విద్యావంతులు జాగింగ్‌ చేయడం చూస్తున్నా. ఆసక్తికర విషయం ఏంటంటే వారే కరోనా వైరస్‌ వ్యాప్తిని ఓ వర్గానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్‌ సమయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా. సినిమాలు, షోస్‌ చూస్తూ ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నా. ఇక టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడటం క్రీడాకారులకు ఒకింత నిరాశ కలిగించేదే. కానీ ఈ సమయంలో అంతకుమించి ఎవరు ఏం చేయలేరు. అయితే ఒలింపిక్స్‌కు సన్నద్దమయ్యే వారు ఈ సమయంలో శారీరకంగా కంటే మానసికంగా ధృఢంగా ఉండాలి’ అని గుత్తా జ్వాల పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios