
IPL 2024 - Sunil Narine : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్మురేపుతున్నాడు. దీంతో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో రెండో స్థానానికి చేరుకున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు చేసి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్ కు ముందు నరైన్ టాప్ 10లో కూడా లేడు. కానీ పంజాబ్ తో జరిగిన ఇన్నింగ్స్ ఆరెంజ్ క్యాప్ పరిస్థితులను మార్చేసింది. నరైన్ ఈ సీజన్ లో 8 ఇన్నింగ్స్ లలో 44.62 సగటుతో 357 పరుగులు చేశాడు. నరైన్ సగటు కూడా 184.02గా ఉంది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 9 మ్యాచ్ లలో 430 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని స్ట్రైక్ రేట్ 145.76 గా ఉండగా, 61.43 సగటుతో పరుగుల వరద పారించాడు.
2011 తర్వాత ఐపీఎల్ లో కోహ్లీ 400 పరుగులు చేయడం ఇది పదోసారి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 349 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ సగటు 58.17గా ఉంది. అతని స్ట్రైక్ రేటు కూడా 142.45 గా ఉంది. నరైన్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (342) నాలుగో స్థానానికి పడిపోయాడు. పంత్ 9 మ్యాచ్ లలో 48.86 సగటుతో 161.32 స్ట్రైక్ రేట్ తో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ ఐదో స్థానంలో నిలిచాడు. 9 మ్యాచుల్లో 334 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 128.96, సగటు 37.11గా ఉంది.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒక్క పరుగుకే ఔటైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ఏడు మ్యాచుల్లో 325 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ 8 మ్యాచ్ లలో 318 పరుగులు చేశాడు. సంజు శాంసన్ 9వ స్థానానికి పడిపోయాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్ లలో 314 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 152.43, సగటు 62.80గా ఉంది. శివమ్ దూబే (311), శుభ్ మన్ గిల్ (304) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
KKR VS PBKS : బెయిర్‌స్టో సూపర్ సెంచరీ.. కోల్‌కతా పై గెలుపుతో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డు
KKR vs PBKS : కోల్ కతా సునామీ ఇన్నింగ్స్.. ఏడేండ్ల రికార్డు బ్రేక్