LSG vs RR IPL 2024 : కెప్టెన్స్ పోరాటంలో కేఎల్ కు తప్పని ఓటమి ... సంజూ భయ్యా బాదేసాడు..!

By Arun Kumar PFirst Published Apr 27, 2024, 11:20 PM IST
Highlights

రాజస్థాన్ రాయల్స్ జట్టు మరోసారి అద్భుతంగా ఆడింది. లక్నో సూపర్ జాయింట్స్ విసిరిన 197 పరుగులు లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి వుండగానే పూర్తిచేసి ప్లేఆఫ్ కు రాయల్ ఎంట్రీ ఇచ్చింది. 

లక్నో : ఇండియర్ ప్రీమియర్ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయపరంపర కొనసాగుతోంది.  ఇప్పటికే అత్యధిక విజయాలతో పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన ఆర్ఆర్ మరోసారి అదరగొట్టింది. లక్నో సూపర్ జాయింట్స్ విసిరిన 197 పరగుల లక్ష్యాన్ని అలవోకగా చేధించింది. కెప్టెన్ సంజూ శాంసన్ (కేవలం 33 బంతుల్లోనే 71 పరుగులు) , దృవ్ జురేల్ (34 బంతుల్లోనే 52 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించడంతో మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించారు. 

రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (18 బంతుల్లో 24 పరుగులు), జోస్ బట్లర్ (18 బంతుల్లో 34) పరుగులు చేసారు. రియాన్ పరాగ్ కూడా 14 పరుగులు మాత్రమే చేసాడు. అయితే సంజూ శాంసన్, దృవ్ జురేల్ చివరివరకు ఆడి రాజస్థాన్ ను గెలిపించారు. 

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లోకల్ టీం లక్నోకు అద్భుత ఆరంభం లభించినా ఫినిషింగ్ మాత్రం సరిగ్గా చేయలేదు.  దీంతో ఈజీగా 200 దాటుతుందని అనుకున్న లక్నో స్కోరు కాస్త 196 పరుగులకే ఆగిపోవాల్సి వచ్చింది.  

లక్నో సూపర్ జాయింట్స్ ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. ఆ తర్వాత గత మ్యాచ్ లో సెంచరీ వీరుడు స్టోయినీస్ ఇలా వచ్చి అలా డకౌట్ అయి వెనుదిరిగాడు. ఇలా కేవలం 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల వైపు పయనిస్తుండగా కెఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్ ఆడాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన రాహుల్ కేవలం 48 బంతుల్లోనే 76 పరుగులు చేసాడు. అతడికి రాహుల్ హుడా (31 బంతుల్లో 50 పరుగులు) చక్కటి సహకారం అందించాడు. దీంతో 12 ఓవర్లలోనే 126 పరుగులు రాబట్టి బలమైన స్థానంలో నిలిచింది లక్నో. 

అయితే క్రీజులో కుదురుకున్న హుడా, రాహుల్ ఔట్ కావడంతో లక్నో స్కోరు నెమ్మదించింది. చివర్లో రాజస్థాన్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేసారు. దీంతో లక్నో కేవలం 196 పరుగుల వద్దే ఇన్నింగ్స్ ముగించింది. రాయల్స్ బౌలర్ సందీప్ శర్మ 2, బౌల్ట్ 1, అవేశ్ ఖాన్ 1, అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.
 

click me!