గంటా చిట్టా విప్పుతానన్న అవంతి: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Sep 2, 2019, 5:38 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

వైఎస్ వివేకానంద విగ్రహన్ని ఆవిష్కరించిన జగన్

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్  సోమవారం నాడు ఆవిష్కరించారు.

 

నా జోలికొస్తే విశాఖలో కూడ ఉండడు:గంటాపై మంత్రి అవంతి ఫైర్

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫైరయ్యారు. గంటా శ్రీనివాసరావు నిర్న చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటరిచ్చారు.

 

వైఎస్ఆర్ పదో వర్థంతి.. తండ్రిని తలుచుకున్న జగన్

వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన తన తండ్రిని తలుచుకున్నారు. ట్విట్టర్ లో వైఎస్ గొప్పతనాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 
 

రికార్డ్ ధరకు 'సైరా' హక్కులు.. బాహుబలి, సాహోలను మించి!

'సైరా' సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. 
 

బాలీవుడ్ హీరోల రికార్డులు గల్లంతు.. 3వ రోజు 'సాహో' సంచలనం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అంచనాలకు అందకుండా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నెగిటివిటీని సైతం లెక్కచేయకుండా ఆడియన్స్ సాహో చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రానికి ప్రీమియర్ షోల నుంచే డివైడ్ టాక్ మొదలైంది. 

ఖైరతాబాద్ గణేషుడికి 750 కిలోల లడ్డు బహుకరణ

ఖైరతాబాద్ గణేష్ విగ్రహనికి 750 కిలోల లడ్డును బహుకరించారు.హైద్రాబాద్ కు చెందిన ఓ కూలర్ వ్యాపారి ఈ గణేష్  విగ్రహనికి లడ్డును బహుకరించారు.

 

ఈటల రాజేందర్ పై కేసీఆర్ వెనక్కి: మంత్రివర్గ విస్తరణపై సందేహాలు

మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయవచ్చుననే ప్రచారం సాగుతోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 

 

తెలుగు మీడియా దెబ్బేసిందని ప్రభాస్..?

ప్రభాస్ రెండేళ్ళ కష్టం సాహో మొన్న శుక్రవారం రిలీజైంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రిలీజైన ఈ చిత్రం బాహుబలిలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మీడియాలో రిలీజ్ కు ముందు కథనాలు తెగ వచ్చాయి. 

 

‘సాహో’కి కేటీఆర్ షాకింగ్ రివ్యూ

 టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'సాహో'పై ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా ఓ సాంకేతిక అద్భుతమని కొనియాడారు. ఎవరు సినిమాపై కూడా ఆయన ప్రశంసలు గుప్పించారు.

 

'బిగ్ బాస్ 3' వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. మరో యాంకర్ రెడీనా..?

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆరు వారాలు గడిచేందుకు వచ్చాయి. ఇంతలో ఐదు ఎలిమినేషన్లు, ఒక్క వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలు జరిగాయి. అయితే వైల్డ్‌కార్డ్‌ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి.. మరుసటి వారంలో వెనుదిరిగి పోయింది.
 

'సాహో'పై మండిపడ్డ దర్శకుడు!

ప్రముఖ ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోం సల్లే  ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాపై మండిపడ్డారు. తను రూపొందించిన 'లార్గో వించ్'ను స్పూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి'పై ఆయన స్పందించారు. 'అజ్ఞాతవాసి' కూడా 'లార్గో వించ్' ప్రేరణతో తీశారని ఆయన అన్నారు. 

 

'సాహో'.. ప్రభాస్ లిస్ట్ లో అరుదైన రికార్డ్!

ఓవర్సీస్ లో అరుదైన ఘనత సాధించాడు ప్రభాస్. వరుసగా మూడు సార్లు 2 మిలియన్ క్లబ్ లో చేరిన హీరోగా రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ నుంచి ఇప్పటివరకు ఏ హీరోకు ఇలా వరుసగా 3 సార్లు 2 మిలియన్ క్లబ్ లో చేరడం సాధ్యం కాలేదు.

 

తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్!

స్వర్గీయ నందమూరి హరికృష్ణ 66వ జయంతి నేడు. ఈ సందర్భంగా హరికృష్ణని ఆయన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు కలసి హరికృష్ణ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

 

సూర్య కోసం వస్తున్న విజయ్ దేవరకొండ

ఒక హీరోకు మరో హీరో సాయిం చేసుకోవటం కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలకు ఇక్కడ హీరోలకు, ఇక్కడ హీరోలకు తమిళ స్టార్స్ తమ తమ ఏరియాల్లో మాట సాయిం చేస్తూంటారు. ప్రమోషన్ చేసి పెడుతూంటారు. ఓ రకంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణి కూడా నడుస్తోంది. ఇప్పుడు అలాంటి స్కీమ్ నే విజయ్ దేవరకొండ,సూర్య చేయబోతున్నారు. 
 

‘సాహో’ఎఫెక్ట్ :ప్రభాస్ నెక్ట్స్ ‘జానూ ’ఆపేసారా?

సాహో.. డిజాస్టర్, అట్టర్ ప్లాఫ్,  అంటూ  కామెంట్స్, రివ్యూస్ వచ్చినా కలెక్షన్స్ వైజ్ గా సత్తా చాటింది. బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించింది. ఫస్ట్ డే నే కలెక్షన్స్ విషయంలో దుమ్ముదులిపింది.ముఖ్యంగా హిందీలో టాక్‌తో సంబంధం లేకుండా ‘సాహో’ రికార్డు కలెక్షన్స్ తో దూసుకువెల్తోంది. నార్త్ లో ఈ సినిమా బాగా వర్కవుట్ అయ్యింది. బీహార్ వంటి ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. 
 

ఈ ప్రాజెక్టు కాన్సిల్ అయ్యినట్లేనా రాజా?

'ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి హిట్ ని  అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆయన గత కొంతకాలంగా  రెండవ సినిమాగా  'మహాసముద్రం' అనే టైటిల్ తో సినిమా చేద్దామని స్క్రిప్టు రాసుకుని రెడీగా ఉన్నారు.  ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా చేద్దామనుకున్నాడు.  కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

 

నరసింహన్‌‌తో రెండు గంటల చర్చలు: కేసీఆర్ ప్లాన్ ఇదీ

నరసింహన్ సేవలను వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 

తమిళిసై టఫ్: కేసీఆర్ ను కలవరపెట్టడానికే బిజెపి ప్లాన్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సౌందర్ రాజన్ ను నియమించడం వెనుక బీజేపీ నాయకత్వం వ్యూహత్మక అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

 

ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు: పాల్గొన్న కేసీఆర్ దంపతులు

వినాయక చవితి వేడుకలు తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి. మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. 

 

మెగా అన్నయ్యకి ముద్దుల తమ్ముడు.. అభిమానుల పవర్ స్టార్!

పవర్ స్టార్… ఈ పేరు వింటే చాలు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆటోమేటిక్ గా గుర్తుకు వచ్చేస్తుంది. 

 

 

click me!