స్వర్గీయ నందమూరి హరికృష్ణ 66వ జయంతి నేడు. ఈ సందర్భంగా హరికృష్ణని ఆయన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరులు కలసి హరికృష్ణ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

'ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే' అని కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ తమ తండ్రిని తలుచుకున్నారు. 

గత ఏడాది ఆగష్టు 29న హరికృష్ణ కారు ప్రమాదానికి గురై మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి కావలి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలతో హరికృష్ణ మరణించారు. 

హరికృష్ణ నటనలోనూ, రాజకీయాల్లోనూ రాణించారు. చంద్రబాబు, నారా లోకేష్ కూడా హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు.