వినాయక చవితి వేడుకలు తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో ఘనంగా జరిగాయి. మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.

సీఎం కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.