యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓవర్సీస్ లో ఓ అరుదైన ఘనత సాధించాడు. వరుసగా మూడు సార్లు 2 మిలియన్ క్లబ్ లో చేరిన హీరోగా రికార్డు సృష్టించాడు. టాలీవుడ్ నుండి ఇప్పటివరకు ఏ హీరోకి కూడా ఇలా వరుసగా మూడు సార్లు 2 మిలియన్ క్లబ్ లో చేరడం సాధ్యం కాలేదు. 

కానీ ప్రభాస్ నటించిన 'సాహో' 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడంతో ఈ రికార్డ్ దక్కింది. గతంలో ప్రభాస్ నటించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాలు 2 మిలియన్ క్లబ్ లోకి చేరగా.. తాజాగా 'సాహో' కూడా ఈ లిస్ట్ లో చేరింది.

ఆదివారం నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమాకి 20 లక్షల 80 వేల 694 డాలర్ల వసూళ్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ నార్త్ లో మాత్రం ఈ సినిమా సత్తా చాటుతోంది.

విడుదలైన మూడు రోజుల్లో ఈ సినిమా 80 కోట్ల రూపాయల నెట్ సాధించింది. ఆదివారం నాటితో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈరోజు సెలవుదినం కావడం ఈ సినిమాకి మరింతగా కలిసొస్తోంది.