విశాఖపట్టణం:మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు గంటా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ధీటుగా స్పందించారు.

సోమవారం నాడు ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ను తాను కనీసం మనిషిగా కూడ చూడనని ఆయన చెప్పారు. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన వారికి తమ పార్టీలో చోటు లేదన్నారు. అంతేకాదు మంచి వాళ్లకే తమ పార్టీలో చోటు ఉంటుందన్నారు.

మంత్రి అవంతి శ్రీనివాస్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం నాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవంతి శ్రీనివాస్ ను తాను కనీసం మంత్రిగా కూడ చూడనని ఆయన చెప్పారు.నా జోలికి వస్తే గంటా శ్రీనివాసరావును విశాఖలో కూడ ఉండకుండా చేయగలనని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు.

వైఎస్ఆర్‌సీపీలో దొంగలకు, భూకబ్జాదారులకు చోటు లేదన్నారు. గంటా శ్రీనివాసరావు రాజకీయాలను వ్యాపారంగా చూస్తారన్నారు. తాను అయ్యన్నపాత్రుడు లాంటి మంచివాడినికానని చెప్పారు. 

గంటా శ్రీనివాసరావు ఎక్కడి నుండి వచ్చాడో తనకు తెలుసునన్నారు. తాను ఇంచార్జీ మంత్రిగా  విజయనగరం జిల్లాలో కనీసం టీడీపీ ఒక్క స్థానం కూడ గెలవలేదని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ ముఠా రాజకీయాలు చేయడం, గ్రూపులు కట్టడం గంటా శ్రీనివాసరావు నైజమన్నారు.

తాను అవంతి శ్రీనివాసరావునే... మంత్రిగా తాను ఏనాడూ భావించడం లేదన్నారు.కానీ, గంటా శ్రీనివాసరావు ఇంకా మంత్రిగా ఉన్నాననే భ్రమలో ఉన్నారని ఆయన సెటైర్లు వేశారు. 

2019 ఎన్నికలకు ముందు వరకు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావులు ఇద్దరూ టీడీపీలోనే ఉన్నారు. ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 

భీమిలి నుండి అవంతి శ్రీనివాస్ అసెంబ్లీకి పోటీ చేయాలని భావించాడు. కానీ సాధ్యపడలేదు.దీంతో ఆయన వైఎస్ఆర్‌సీపీ తీర్థం  పుచ్చుకొన్నారు. 2014 ఎన్నికలకు ముందు అవంతి శ్రీనివాస్ , గంటా శ్రీనివాసరావు, కన్నబాబు తదితరులు టీడీపీలో చేరారు.


సంబంధిత వార్తలు

వైఎస్‌ఆర్‌సీపీలో చేరికపై గంటా సంచలనం