బిగ్ బాస్ సీజన్ 3 ఆరు వారాలు పూర్తి చేసుకొంది. ఇప్పటికే షో నుండి ఐదు ఎలిమినేషన్స్ జరిగాయి. అలానే ఓ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన తమన్నా సింహాద్రి హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. 

ఆమె ప్రవర్తన కారణంగా ప్రేక్షకుల నుండి వ్యతిరేకత రావడంతో ఆమె హౌస్ నుండి బయటకి రాక తప్పలేదు. ఆమె ఎలిమినేట్ అయినప్పటి నుండి హౌస్ లోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపించడం మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రద్ధా దాస్, ఈషా రెబ్బ, హెబ్బా పటేల్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

కానీ ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. తాజాగా ఈ లిస్ట్ లో ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి పేరు వినిపిస్తోంది. ఇప్పటికే హౌస్ లో యాంకర్ శ్రీముఖి ఉంది. ఆమె ఎంత రచ్చ చేస్తుందో చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు మరో యాంకర్ ని హౌస్ లోకి తీసుకువెళ్లడానికి బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది.

మరి ఈమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఇక ఆదివారం నాడు హౌస్ నుండి పునర్నవి, హిమజ, మహేష్ విట్టాల నుండి ఒకరు ఎలిమినేట్ అవుతారనుకుంటే.. ఈ వారం ఎలిమినేషన్ లేదని గెస్ట్ హోస్ట్ గా వచ్చిన రమ్యకృష్ణ వెల్లడించడంతో హౌస్ మేట్స్ అంతా ఆనందంలో మునిగిపోయారు.