Asianet News TeluguAsianet News Telugu

ఖైరతాబాద్ గణేషుడికి 750 కిలోల లడ్డు బహుకరణ

ఖైరతాబాద్ గణేష్ విగ్రహనికి 750 కిలోల లడ్డును బహుకరించారు.హైద్రాబాద్ కు చెందిన ఓ కూలర్ వ్యాపారి ఈ గణేష్  విగ్రహనికి లడ్డును బహుకరించారు.

Khairatabad set to honour Ganesha with 750 kg laddu
Author
Hyderabad, First Published Sep 2, 2019, 11:53 AM IST

హైదరాబాద్: 61 అడుగుల ఎత్తున్న ఖైరతాబాద్ గణేష్ విగ్రహనికి 750 కిలోల బరువున్న లడ్డును భక్తులు బహుకరించారు.అంతేకాదు 70 అడుగుల శాలువాను కూడ బహుకరించారు.

సోమవారం నాడు ఖైరతాబాద్ గణేష్‌ విగ్రహన్ని భక్తుల సందర్శన కోసం అనుమతి ఇచ్చారు. కూలర్స్ బిజినెస్ చేసే శ్రీకాంత్ అనే వ్యక్తి 750 కిలోల లడ్డును బహుకరించాడు. 

15 మంది ప్రజలు  లడ్డూ తయారీలో  సుమారు 36 గంటల పాటు కష్టపడినట్టుగా శ్రీకాంత్  చెప్పాడు. ఈ లడ్డూ తయారీ కోసం రూ. 90 వేలు ఖర్చు చేసినట్టుగా ఆయన తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ భక్తుడు ప్రతి ఏటా ఖైరతాబాద్ గణేష్  విగ్రహనికి  సమర్పిస్తారు. కానీ కొన్ని ఏళ్ల నుండి  ఈ ప్రసాదం తూర్పుగోదావరి జిల్లా నుండి ఇవ్వడం లేదు. స్థానికంగానే ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారు.

ప్రతి సంవత్సరం కంటే మూడు మాసాల ముందే  ఖైరతాబాద్  గణేష్ విగ్రహన్ని తయారీని ప్రారంభించారు. ఈ ఏడాది 24 చేతులు, 24 తలలు, 12 పాములతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహం తయారీకి రూ. 80 లక్షలను ఖర్చు చేశారు. సుమారు 150 మంది కళాకారులు ఈ విగ్రహ తయారీలో పనిచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios