తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
11:34 PM (IST) Jun 29
Amazon Prime Day 2025 sale: అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ జూలై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ఉండనుంది. ఈ సేల్ లో ఆపిల్ iPhone 15, సామ్ సంగ్ Galaxy S24 Ultra, OnePlus 13S పై 40 శాతం వరకు వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.
11:12 PM (IST) Jun 29
Indian Navy : ఆపరేషన్ సింధూర్‌లో భారత నౌకాదళం సామర్థ్యం, వ్యూహాత్మక సంకల్పాన్ని చూపించి దేశ భద్రతలో కీలకపాత్ర పోషించింది. శత్రు దేశాలకు ఒక హెచ్చరికను పంపింది.
10:29 PM (IST) Jun 29
Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) జూలై మొదటివారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
10:21 PM (IST) Jun 29
చాలామంది సినిమా వాళ్లు కెరీర్ స్టార్ట్ అయ్యి, ఓ రెండు మూడు అవకాశాలు రాగానే , వచ్చిన సంపాదనతో ప్రాపర్టీస్, బిజినెస్ ప్లాన్ చేస్తారు, భూములు కొంటారు. కాని ఇండస్ట్రీలో 25 ఏళ్లు హీరోగా ఉన్నా.. సొంత ఇల్లు కూడా కొనలేదట ఈ సెలబ్రిటీ. ఇంతకీ ఎవరతను?
09:19 PM (IST) Jun 29
India vs England: స్మృతి మంధానా ఇంగ్లాండ్‌పై టీ20లో సెంచరీతో మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు జెర్సీ నెంబర్ 18 హాట్ టాపిక్ గా మారింది.
08:13 PM (IST) Jun 29
iPhone 17 series: ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ త్వరలోనే మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. వీటిలో కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు ఉండనున్నాయి.
06:17 PM (IST) Jun 29
Worlds Toughest Jobs: అలెగ్జాండ్రియా ఫారోస్ లైట్‌హౌస్‌కి కీపర్‌గా ఉన్నవారికి ఏకంగా రూ.30 కోట్లు జీతం ఇచ్చేవారు. ఈ జాబ్ ను ప్రపంచంలోని కఠినమైన ఉద్యోగంగా పరిగణిస్తారు. ఎందుకో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:21 PM (IST) Jun 29
Turmeric Board : నిజామాబాద్‌లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇది పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలగా ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
03:38 PM (IST) Jun 29
WhatsApp new features: వాట్సాప్ తన యూజర్ల కోసం మరిన్ని కొత్త ఫీచర్లు తీసుకువచ్చింది. ఇతర యాప్ లు అందించే కొన్ని సేవలు వాట్సాప్ లోనే పొందవచ్చు. ఆ కొత్త ఫీచర్లు ఏంటి? ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
12:03 PM (IST) Jun 29
ప్రపంచం వేగంగా డిజిటల్ వైపు దూసుకుపోతున్న ఈ రోజుల్లో ప్రకటనల రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోన్న వీడియోనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
11:14 AM (IST) Jun 29
రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా మోసాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల అత్యాశను పెట్టుబడిగా మార్చుకొని లక్షలు కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.
10:36 AM (IST) Jun 29
అగ్నివీర్లకు మూడో అసెస్మెంట్ ప్రక్రియ జరుగుతోంది. డిఫెన్స్, సెక్యూరిటీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అసెస్‌మెంట్ ప్రక్రియ లక్ష్యం, పారదర్శకత, న్యాయబద్ధత, నిష్పాక్షికతలకు ప్రాధాన్యతనిస్తుంది.
10:13 AM (IST) Jun 29
వ్యాపారం చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ సరైన ఐడియా, సరిపడ పెట్టుబడి లేక చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో కూడా కాసులు కురిసే వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
08:45 AM (IST) Jun 29
హైదరాబాద్‌లోని మహా న్యూస్ కార్యాలయంపై శనివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు వ్యక్తులు కార్యాలయంలో అద్దాలతో పాటు బయట ఉన్న కొన్ని కార్లను ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీలోనూ సంచలనం సృష్టించింది.
07:56 AM (IST) Jun 29
రుతుపవనాలు ఎంట్రీ తర్వాత కూడా ఆశించిన స్తాయిలో వర్షాలు కురవలేదు. జూన్ నెల మొత్తంలో పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. అయితే తాజాగా వాతావరణ శాఖ ఒక కూల్ న్యూస్ చెప్పింది. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
07:32 AM (IST) Jun 29
రూ. లక్ష దాటి పరుగులు పెట్టిన బంగారం ధర ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలో ప్రతీ రోజూ తగ్గుదుల కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత తులం బంగారం ధర రూ. 97 వేల మార్క్‌కి చేరింది.