- Home
- Business
- iPhone 17 series: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్లతో నాలుగు మోడల్స్.. ధరలు ఎలా ఉంటాయంటే?
iPhone 17 series: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. కొత్త ఫీచర్లతో నాలుగు మోడల్స్.. ధరలు ఎలా ఉంటాయంటే?
iPhone 17 series: ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ త్వరలోనే మార్కెట్ లోకి విడుదల కానున్నాయి. వీటిలో కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు ఉండనున్నాయి.

ఐఫోన్ 17 సిరీస్: నాలుగు మోడల్స్‌తో ఆపిల్ బిగ్ అప్‌డేట్స్
iPhone 17 series: ఆపిల్ కంపెనీ తన ప్రతిష్టాత్మక ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలోనే విడుదల చేసే అవకాశముందని ప్రముఖ టెక్ విశ్లేషకుడు డేవిడ్ ఫీలన్ అంచనా వేశారు. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ విడుదల కానున్నాయి.
వాటిలో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. వీటిలో కొత్త ఫీచర్లలను ఆపిల్ సంస్థ పరిచయం చేయనుందని సమాచారం.
ప్రోమోషన్ డిస్‌ప్లే టెక్నాలజీతో ఐఫోన్ 17 సిరీస్
ఇప్పటి వరకు ప్రో మోడల్స్‌కే పరిమితమైన ప్రోమోషన్ డిస్‌ప్లే (ProMotion display) టెక్నాలజీ (120Hz రిఫ్రెష్ రేట్) ఈసారి అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి రానుంది. దీనివల్ల స్క్రోల్ చేయడంలో మెరుగైన అనుభవం, వీడియో ప్లేబ్యాక్ మరింత స్మూత్‌గా ఉంటుంది.
ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఎలా ఉండనున్నాయి?
ఐఫోన్ 17 సిరీస్ ధరల విషయానికి వస్తే.. ఐఫోన్ 17 ప్రారంభ ధర $799 (భారతదేశంలో సుమారు రూ.79,999)గా ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ఎయిర్ $899 (రూ.89,999)కు లభించనుందని అంచనా. ప్రో మోడల్ $999 (రూ.1,39,900)గా, ప్రో మ్యాక్స్ మోడల్ $1199 (రూ.1,64,900) వరకు ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి.
ఈ ధరల పెరుగుదల వెనుక భద్రతాపరమైన చర్యలు, కొత్త ఫీచర్లు, మరింత మెరుగైన విడిభాగాల వాడకం, టారిఫ్ వంటి అంశాలు ఉన్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఐఫోన్ 17 సిరీస్ : కెమెరా అప్‌గ్రేడ్స్
ఐఫోన్ 17 సిరీస్‌లో కీలక మార్పులు ఉండనున్నాయి. ముందు కెమెరా 12 మెగాపిక్సెల్స్ నుంచి 24 మెగాపిక్సెల్స్ కు అప్‌గ్రేడ్ అవుతోంది. దీంతో సెల్ఫీలలో మరింత స్పష్టత పెరగడమే కాకుండా, కటింగ్ చేసినప్పుడు క్వాలిటీ లోటు ఉండదని సమాచారం.
ప్రో మ్యాక్స్ మోడల్‌లో మూడు 48MP రియర్ కెమెరాలు ఉండనున్నాయి. వైడ్, అల్ట్రా వైడ్, టెట్రాప్రిజం టెలిఫోటో లెన్స్ లు ఉండనున్నాయి. ఇది తొలిసారిగా మూడు 48MP కెమెరాలు కలిగిన ఐఫోన్ అవుతుంది. 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
అల్యూమినియం డిజైన్ తో మళ్లీ తిరిగివస్తున్న ఐఫోన్ 17 సిరీస్
ఈసారి అన్ని మోడల్స్‌లో ఆల్యూమినియం ఫ్రేమ్ ఉండనుండటం గమనార్హం. ఇది ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌కి కొత్త మార్పుగా చెప్పవచ్చు, ఎందుకంటే గతంలో వీటిలో స్టెయిన్‌లెస్ స్టీల్ వాడుతుండేవారు. అలాగే, గ్లాస్ బ్యాక్‌తో తిరిగి వస్తుందని కూడా భావిస్తున్నారు.
ఐఫోన్ 17 సిరీస్ ప్రో మ్యాక్స్ మోడల్ ప్రత్యేకతలు గమనిస్తే..
• A19 ప్రో చిప్‌సెట్ తో శక్తివంతమైన పనితీరు
• 12GB RAM, ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు అనుకూలంగా ఉంటుంది
• వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్
• Wi-Fi 7 సపోర్ట్
• లార్జ్ డిస్‌ప్లే యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ తో ఉండనుంది
• పెద్ద బ్యాటరీ దీర్ఘకాలిక వీడియో ప్లేబ్యాక్ అనుకూలంగా ఉంటుందని సమాచారం
ప్లస్ వెర్షన్‌కు ప్రత్యామ్నాయంగా ఐఫోన్ 17 ఎయిర్
2024లోని ఐఫోన్ 16 ప్లస్ స్థానంలో 2025లో ఐఫోన్ 17 ఎయిర్ వస్తోంది. ఇది సాధారణ మోడల్ కంటే అధిక ధరకు, ప్రో మోడల్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది. ఇది మధ్య స్థాయి వినియోగదారులను లక్ష్యంగా ఉంచి రూపొందించిన మోడల్‌గా కనిపిస్తోంది.
మొత్తంగా ఐఫోన్ 17 సిరీస్‌తో ఆపిల్ మరిన్ని వినూత్న ఫీచర్లు, డిజైన్ మార్పులతో ముందుకొస్తోంది. అధికారిక విడుదల తేదీ సెప్టెంబర్ 9గా ఉండే అవకాశం ఉండగా, ఈ మోడల్స్ ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మార్కెట్ లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.