- Home
- Technology
- Viral Video: ఏఐతో ఏదైనా సాధ్యమే.. కెమెరా, సెట్స్, లొకేషన్ ఇవేవీ లేకుండానే యాడ్స్. ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే.
Viral Video: ఏఐతో ఏదైనా సాధ్యమే.. కెమెరా, సెట్స్, లొకేషన్ ఇవేవీ లేకుండానే యాడ్స్. ఈ వీడియో చూస్తే మతి పోవాల్సిందే.
ప్రపంచం వేగంగా డిజిటల్ వైపు దూసుకుపోతున్న ఈ రోజుల్లో ప్రకటనల రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోన్న వీడియోనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
- FB
- TW
- Linkdin
Follow Us

యాడ్స్ మేకింగ్‌లోనూ ఏఐ
అన్ని రంగాల్లో చొచ్చుకుపోతున్న ఏఐ ఇప్పుడు యాడ్ మేకింగ్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఒక యాడ్ వీడియో రూపొందిచేందుకు ఇకపై యాక్టర్, కెమెరా, లొకేషన్స్ ఇలాంటివేవి అసరం ఉండదు. డీప్‌ఫేక్ (Deepfake) టెక్నాలజీ, AI లిప్‌సింక్ మోడల్స్ వలన ఇది సాధ్యమవుతోంది. వాయిస్ క్లోన్‌తో ఏ వ్యక్తి గొంతు కావాలన్నా పొందొచ్చు. ఇక స్క్రిప్ట్‌ను అందిస్తే చాలు నిజంగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లే వీడియో తయారు చేసుకోవచ్చు.
కెమెరా, సెట్స్, లొకేషన్స్ అవసరమే లేదు
ఇప్పటి వరకు ఒక యాడ్ తీయాలంటే... కెమెరామెన్లు, డైరెక్టర్లు, లైటింగ్, మేకప్, లొకేషన్స్, పర్మిట్లు ఇలా ఎన్నో ఏర్పాట్లు ఉండేవి. కానీ ఇప్పుడు AI తో ఓ హై రెజల్యూషన్ ఫొటో ఇచ్చినా చాలు. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్యారిస్ కావాలా? చైనా మార్కెట్ కావాలా? అన్నీ 3D AI గ్రాఫిక్స్‌తో అద్భుతంగా సృష్టించవచ్చు. అంటే ఇక లొకేషన్ బడ్జెట్, ట్రావెల్ ఖర్చులనేవే ఉండవు.
వర్చువల్ మోడల్స్, డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్లు
ఇప్పటికే ప్రముఖ బ్రాండ్లు AI మోడల్స్ ఉపయోగిస్తూ ఉన్నాయ్. వీరికి వయసు పెరగదు, డేట్స్ అడ్జెస్ట్ కావన్న ఇబ్బంది ఉండదు, లైవ్ షూటింగ్ అవసరం లేదు. ఉదాహరణకు, Shudu అనే వర్చువల్ మోడల్‌ను ఎన్నో ఫ్యాషన్ బ్రాండ్లు తమ ప్రచారాల్లో వాడుతున్నాయి. ఇవే కాదు, ఇన్‌ఫ్లుఎన్సర్లు కూడా డిజిటల్ అవతారంలోకి మారిపోతున్నారు.
తక్కువ ఖర్చుతో మంచి అవుట్‌పుట్
ఒక టివీ యాడ్‌ని షూట్ చేయాలంటే పాత కాలంలో లక్షల రూపాయలు ఖర్చుచేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు AI టూల్స్ ద్వారా వేల రూపాయలతోనే సినిమాటిక్ యాడ్ తయారవుతుంది. వేగంగా పనితీరు, నచ్చిన వేరియేషన్లకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం. బ్రాండ్‌కు అనుగుణంగా కలర్, మూడ్ కస్టమైజ్ చేసుకోవచ్చు.
వైరల్ అవుతోన్న వీడియో.
తాజాగా రాశీ అగర్వాల్ అనే యువతి లింక్డిన్‌లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ టూత్ పేస్ట్ బ్రాండ్ అయిన సెన్సోడిన్ యాడ్‌ను ఏఐ సహాయంతో రూపొందించారు. ఈ వీడియో చూస్తే ఏఐతో రూపొందించారన్న విషయాన్ని గుర్తించడం చాలా కష్టం అంత సహజంగా ఈ వీడియో ఉండడం విశేషం. యూజర్లు తమకు కావాల్సిన అవసరాలు చెప్తే చాలు క్షణాల్లో వీడియోను రూపొందిస్తామని చెబుతున్నారు అగర్వాల్.
ప్రభావం తప్పదా.?
AI ప్రకటనల టెక్నాలజీ సంస్థల ఖర్చులను తగ్గించడమే కాదు, క్రియేటివిటీకి కొత్త దారులు తెరిచింది. అయితే ఇదే సమయంలో నటులు, టెక్నీషియన్ల భవితవ్యంపై ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. భవిష్యత్తుల్లో ఎంతో మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏఐ భవిష్యత్తులో మరెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.