WhatsApp: వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే న్యూస్.. కొత్త ఫీచర్లు వచ్చేశాయ్
WhatsApp new features: వాట్సాప్ తన యూజర్ల కోసం మరిన్ని కొత్త ఫీచర్లు తీసుకువచ్చింది. ఇతర యాప్ లు అందించే కొన్ని సేవలు వాట్సాప్ లోనే పొందవచ్చు. ఆ కొత్త ఫీచర్లు ఏంటి? ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

WhatsApp: యూజర్ల కోసం వాట్సాప్ డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్
వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పుడు డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐఓఎస్ బీటా యూజర్లకు సైతం ఈ ఫీచర్ ను తీసుకువచ్చింది. డ్యాకుమెంట్లను స్కాన్ చేయడం కోసం ఇప్పుడు మరో యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూజర్లకు వాట్సాప్ నుంచే డాక్యుమెంట్లను స్కాన్ చేసి పంపించే అవకాశం కల్పిస్తోంది.
బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వాట్సాప్ డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్
ఈ ఫీచర్ మొదటిసారిగా WhatsApp బీటా ఫర్ Android వెర్షన్ 2.25.18.29లో కనిపించింది. ఇప్పుడు తాజా బీటా అప్‌డేట్ ద్వారా మరికొంతమంది యూజర్లు దీన్ని ఉపయోగించే అవకాశం పొందుతున్నారు.
Google Play Storeలో తాజా బీటా వెర్షన్ డౌన్‌లోడ్ చేసిన కొందరు యూజర్లు ఈ కొత్త ‘Scan Document’ ఎంపికను అటాచ్ మెంట్ మెనులో చూసినట్లు చెప్పారు. మరి మీ వాట్సాప్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి.
వాట్సాప్ డాక్యుమెంటును స్కాన్ ఎలా ఉపయోగించాలి?
ఈ ఫీచర్ ద్వారా ‘Browse Documents’, ‘Choose from Gallery’ వంటి ఎంపికల వద్ద ‘Scan Document’ అనే కొత్త ఎంపిక కనిపిస్తుంది. దీనిపై టాప్ చేస్తే యూజర్ మొబైల్ కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ద్వారా డాక్యుమెంటును స్కాన్ చేసి వాట్సాప్ చాట్‌ల్లోనో గ్రూప్‌ల్లోనో షేర్ చేయవచ్చు.
మెన్యువల్, ఆటోమేటిక్ మోడ్‌లలో వాట్సాప్ డాక్యుమెంట్ స్కానింగ్
వాట్సాప్ డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్‌లో రెండు షూటింగ్ మోడ్‌లు ఉన్నాయి:
• మాన్యువల్ మోడ్: యూజర్ ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు ఫోటో తీయవచ్చు.
• ఆటోమేటిక్ మోడ్: డాక్యుమెంట్ ఎడ్జ్‌లను వాట్సాప్ స్వయంచాలకంగా గుర్తించి ఫోటోను స్వయంగా స్కాన్ చేసి ఇస్తుంది.
స్కాన్ చేసిన ఫోటోను వాట్సాప్ తక్షణమే ప్రాసెస్ చేసి PDF ఫార్మాట్‌లో మార్చేస్తుంది. ఇది యూజర్ మొబైల్‌లోనే జరుగుతుంది. Android స్థానిక డాక్యుమెంట్ క్యాప్చర్ APIలను ఉపయోగించి ఈ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
మెటా AI తో వాట్సాప్ లో మెసేజ్ సమ్మరీ ఫీచర్
అన్ రీడ్ మెసేజ్‌లను చదవడానికి సమయం లేకపోయినప్పుడు, వాట్సాప్ ఇప్పుడు Meta AI ఆధారిత మెసేజ్ సమ్మరీ టూల్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్ అన్ రీడ్ చాట్స్‌ను సంక్షిప్తంగా వివరిస్తుంది. దీంతో యూజర్ ప్రధాన విషయాలను ముందుగానే అర్థం చేసుకునే వీలుంది.
వాట్సాప్ ప్రకారం, ఈ ఫీచర్ మెటా ప్రయివేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. దీనివల్ల యూజర్ మెసేజ్‌లు లేదా సమ్మరీలను మెటా గానీ, వాట్సాప్ గానీ యాక్సెస్ చేయలేవు. అదేవిధంగా, చాట్‌లో ఉన్న ఇతర సభ్యులకు ఈ సమ్మరీలు కనిపించవు.
వాట్సాప్ ప్రయివేట్ ప్రాసెసింగ్ ఎలా పనిచేస్తుంది?
మెటాకు చెందిన Trusted Execution Environment (TEE) ఆధారంగా నిర్మించిన ఈ ఫ్రేమ్‌వర్క్ మూడు ప్రధాన సూత్రాలపై ఆధారపడి పనిచేస్తుందని సంస్థ తెలిపింది.
1. Secure Data Handling: మెసేజ్‌లు ప్రాసెస్ అయ్యే సమయంలో లేదా ట్రాన్స్‌మిషన్ సమయంలో అవి బయట వ్యక్తులకు అందకుండా ఉంటాయి.
2. Enforceable Protections: ఎవరైనా టెక్నికల్ సిస్టమ్‌లో తేడా తేవాలని చూస్తే, ఆ ప్రాసెసింగ్ ఆగిపోతుంది లేదా మార్పును గుర్తిస్తుంది.
3. Transparency Mechanism: సెక్యూరిటీ ఉల్లంఘనలు ఎప్పుడైనా చోటు చేసుకుంటే అవి స్పష్టంగా గుర్తించగలిగే విధంగా ఉంటాయి.
వాట్సాప్ యాడ్స్
మెటా సంస్థ వాట్సాప్‌ను ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రకటనలను ప్రవేశపెడుతోంది. మొదటగా స్టెటస్ ఫీడ్‌లో స్పాన్సర్డ్ కార్డులు, అప్డేట్ ట్యాబ్‌లో బిజినెస్ ఛానల్స్ రూపంలో ప్రకటనలు కనిపించవచ్చు. ఇవి వ్యక్తిగత చాట్ లలో రావు. కానీ, యూజర్ల గోప్యతపై ఒత్తిడి పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, Meta లోపల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, WhatsApp లో పంపిన బిజినెస్ మెసేజ్‌లు దాదాపు 90 శాతం వరకు ఓపెన్ అవుతున్నాయి. ఇది ఈమెయిల్స్ కన్నా గణనీయంగా మెరుగైన ప్రతిస్పందన. కానీ మరిన్ని బ్రాండ్‌లు ఒకే తరహా ప్రకటనలతో వస్తే, యూజర్లు అలసట చెందే అవకాశం ఉంది.