MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Cyber crime: గూగుల్‌లో రివ్యూ ఇస్తే డ‌బ్బులు ఇస్తామ‌న్నారు.. తీరా చూస్తే రూ. 14 ల‌క్ష‌లు

Cyber crime: గూగుల్‌లో రివ్యూ ఇస్తే డ‌బ్బులు ఇస్తామ‌న్నారు.. తీరా చూస్తే రూ. 14 ల‌క్ష‌లు

రోజురోజుకీ సైబ‌ర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని ర‌కాల అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతోన్నా మోసాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌జ‌ల అత్యాశ‌ను పెట్టుబ‌డిగా మార్చుకొని ల‌క్ష‌లు కొల్ల‌గొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 29 2025, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రివ్యూ ఇస్తే డ‌బ్బులంటూ
Image Credit : google

రివ్యూ ఇస్తే డ‌బ్బులంటూ

అవంతి స్నేహ పేరుతో ఉన్న వాట్సప్‌ ద్వారా హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి(43)ని సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించారు. గూగుల్‌లో రివ్యూలు ఇస్తే చాలు డ‌బ్బులిస్తామ‌ని న‌మ్మించారు. ఒక్కో రివ్యూకు రూ. 40 చొప్పున డ‌బ్బులు ఇస్తామ‌న్నారు.

అన్న‌ట్లుగానే మొద‌ట కొన్ని చిన్న చిన్న టాస్కులు అందించారు. రివ్యూల‌కు రూ. 40 ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. దీంతో క్ర‌మంగా న‌మ్మిన అత‌ను మ‌రింత ముందుకెళ్లాడు.

25
క్రిప్టోలో పెట్టుబడులు పెట్ట‌మంటూ
Image Credit : Google

క్రిప్టోలో పెట్టుబడులు పెట్ట‌మంటూ

కొద్దిసేపటికే "ఇంకొన్ని టాస్క్‌లు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి" అంటూ అతడిని ఓ నకిలీ వెబ్‌సైట్‌కు దారితీసింది. ఆ వెబ్‌సైట్‌లో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టేలా సూచించింది. పెట్టిన డబ్బులపై భారీ లాభాలు వచ్చినట్లుగా చూపుతూ నకిలీ లెక్కలను చూపించారు. దీంతో అత్యాశ ప‌డ్డ వ్య‌క్తి పెట్టుబ‌డులు పెట్ట‌డం ప్రారంభించారు.

Related Articles

Related image1
Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. నెల‌కు రూ. 50 వేలు సంపాదించొచ్చు. బెస్ట్‌ బిజినెస్ ఐడియా
Related image2
Gold Price: భారీగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌.. తులంపై రూ. 10 వేలు త‌గ్గ‌నుందా.?
35
బై మోర్ పేరుతో ఒత్తిడి
Image Credit : social media

బై మోర్ పేరుతో ఒత్తిడి

ఆ వెబ్‌సైట్‌లో "Buy More" అనే బటన్ క్లిక్ చేయగానే మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సూచనలు వచ్చాయి. పెట్టకపోతే అకౌంట్‌ ఫ్రీజ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో కొంచెం కొంచెం పెట్టుబ‌డులు పెంచుతూ పోయాడు. చివ‌రికి ఇన్‌క‌మ్ ట్యాక్స్‌, జీఎస్‌టీ పేరుతో మొత్తం క‌లిపి రూ. 14.08 ల‌క్ష‌లు వ‌సూలు చేశారు. ఇవన్నీ ఫేక్ పేమెంట్స్, నకిలీ లింకుల ద్వారా చేయించారు.

45
ఎంత‌కు స్పందించ‌క‌పోయేస‌రికి
Image Credit : iSTOCK

ఎంత‌కు స్పందించ‌క‌పోయేస‌రికి

రూ. 14 ల‌క్ష‌లు పోయిన త‌ర్వాత మోస‌పోయాన్న విష‌యం తెలుసుకున్న వ్య‌క్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోంది. వాట్సాప్ ద్వారా సంప్ర‌దించిన వ్య‌క్తి ఎవ‌ర‌న్న దానిపై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు.

55
ఇలాంటి మోసాల బారినప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి.?
Image Credit : iSTOCK

ఇలాంటి మోసాల బారినప‌డ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి.?

"రూ.40 కే టాస్క్", "లాభాలు రెట్టింపు" అంటూ ఎవరైనా చెప్పినా, నిజమైన ఉద్యోగాల్లో ఇలా ఉండదన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి అట్రాక్టివ్‌గా ఉన్నా ప్రాక్టిక‌ల్‌గా అస‌లు ఉండ‌వు. తెలియని లింకులు, గూగుల్‌ రివ్యూ లాంటి టాస్క్ లింకులు ఎట్టి ప‌రిస్థితుల్లో క్లిక్ చేయ‌కూడ‌దు.

డోమైన్ పేరు, https వంటివి లేని లింక్స్‌, ప్రొఫెష‌న‌ల్ డిజైన్ లేని వెబ్‌సైట్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. సరైన సమాచారం లేకుండా ఎప్పుడూ డబ్బు పెట్టొద్దు. ఒక‌వేళ మీరు సైబ‌ర్ నేరస్తుల చేతిలో మోస‌పోయిన‌ట్లు అనుమానం వ‌స్తే వెంట‌నే సైబ‌ర్ హెల్ప్ లైన్ నెంబ‌ర్ 1930కి కాల్ చేయాలి. అలాగే సైబ్ క్రైమ్ అధికారిక వెబ్ సైట్‌ను సంప‌ద్రించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Recommended image2
Now Playing
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu
Recommended image3
Oyo: తెలుగు ప్ర‌జ‌ల‌కు ఓయో గుడ్ న్యూస్‌.. ఇక‌పై ఆ న‌గ‌రాల్లో కూడా రూమ్స్
Related Stories
Recommended image1
Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. నెల‌కు రూ. 50 వేలు సంపాదించొచ్చు. బెస్ట్‌ బిజినెస్ ఐడియా
Recommended image2
Gold Price: భారీగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌.. తులంపై రూ. 10 వేలు త‌గ్గ‌నుందా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved