Amazon Prime Day 2025 sale: అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ జూలై 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు ఉండనుంది. ఈ సేల్ లో ఆపిల్ iPhone 15, సామ్ సంగ్ Galaxy S24 Ultra, OnePlus 13S పై 40 శాతం వరకు వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి.

Amazon Prime Day 2025: ఈ ఏడాది భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 వినియోగదారులకు మరింత ఎక్కువ సమయం ఉండనుంది. అమెజాన్ ఇండియా ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జూలై 12వ తేదీ అర్థరాత్రి 12:00 గంటలకు ప్రారంభమై, జూలై 14వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. మూడు రోజులు పాటు జరుగుతున్న ఈ సేల్‌ దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన అత్యంత పొడవైన ప్రైమ్ డే సేల్‌గా గుర్తింపు పొందనుంది.

ప్రైమ్ డే అమ్మకాలు ప్రత్యేకంగా ప్రైమ్ సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, వస్త్రాలు, హోం అప్లయన్సెస్, బ్యూటీ ఉత్పత్తులు, కిచెన్ ఐటమ్స్ తదితర విభాగాల్లో బిగ్ డిస్కౌంట్లు లభిస్తాయి.

iPhone 15, Galaxy S24 Ultra, OnePlus 13S పై ప్రత్యేక డిస్కౌంట్లు

ఈ సేల్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపులు అందించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా Samsung Galaxy S24 Ultra, OnePlus 13S, iPhone 15, iQOO Neo 10 వంటి పాపులర్ మోడల్స్ ఉన్నాయి.

ప్రస్తుతం అమెజాన్‌లో Samsung Galaxy S24 Ultra (12GB + 256GB) మోడల్ ధర రూ. 84,999గా ఉంది. ప్రైమ్ డే సమీపిస్తున్న నేపథ్యంలో దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఐఫోన్ 15 ప్రస్తుతం రూ. 60,300కి లభిస్తోంది, ఇది అసలు ధర అయిన రూ. 69,900 కంటే 14% తక్కువగా ఉంది. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఇది రూ. 50,000 కంటే తక్కువకే దొరుకవచ్చని అంచనాలు ఉన్నాయి.

iPhone 15 స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఇది 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ (Super Retina XDR) డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని వెనుక భాగంలో 48MP ప్రధాన సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా వ్యవస్థ ఉంది. ఇది Apple A16 Bionic చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

OnePlus 13 S పై బిగ్ డిస్కౌంట్‌

ఇటీవలే లాంచ్ అయిన వన్ ప్లస్ (OnePlus) 13S కూడా ఈ సేల్‌లో ప్రత్యేక ఆఫర్‌తో లభించనుంది. రూ. 49,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌తో శక్తివంతంగా ఉంది. 5,850mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ వుక్ ఫాస్ట్ చార్జింగ్, డ్యూయల్ కెమెరా వ్యవస్థ వంటి ఫీచర్లతో ఇది మిడ్-రేంజ్ కేటగిరీలో పోటీగా నిలుస్తోంది. ప్రైమ్ డే సందర్భంగా దీని ధర మరింత తగ్గే అవకాశం ఉంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో చాలా ఆఫర్లు ఉన్నాయి

తక్కువ ధరలతో పాటు, వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI, ఎక్స్చేంజ్ డీల్స్, ప్రత్యేక ప్రమోషన్లను ఉపయోగించుకోవచ్చు. HDFC, ICICI, SBI వంటి ప్రముఖ బ్యాంకులతో కలిసి అమెజాన్ అదనపు క్యాష్‌బ్యాక్‌లు అందించనుంది. మొత్తంగా రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025లో బిగ్ డిస్కౌంట్లు ఉండనున్నాయి. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఇతర హాట్ కేటగిరీలపై బంపర్ డీల్స్ కోసం ప్రైమ్ మెంబర్స్ రెడీగా ఉండండి మరి !