తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైప్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి..
11:59 PM (IST) Jul 14
Fauja Singh: ప్రపంచ ప్రసిద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్ (114 ఏళ్లు) మరణించారు. పంజాబ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందారు.
11:33 PM (IST) Jul 14
Mohammed Siraj: లార్డ్స్ టెస్టులో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. సిరాజ్ ఔటైన వెంటనే గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ గా మారాయి.
10:11 PM (IST) Jul 14
IND vs ENG: లార్డ్స్ టెస్ట్‌లో భారత్ 193 పరుగుల టార్గెట్ ను అందుకోలేకపోయింది. జాడేజా పోరాటం చేసినా.. చివరకు 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.
09:14 PM (IST) Jul 14
Jofra Archer: లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్ స్పెషల్ షో కనిపించింది. అతని బౌలింగ్ దెబ్బకు రిషబ్ పంత్ వికెట్ గాల్లో హెలికాప్టర్ లా చక్కర్లు కొట్టింది. అలాగే, 140 కిలో మీటర్ల వేగంతో విసిరి.. అదే బాల్ ను క్యాచ్ పట్టాడు.
07:13 PM (IST) Jul 14
India vs England: లండన్‌లోని లార్డ్స్ లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య ఉద్రిక్తతలలో ఉత్కంఠను పెంచాయి. మ్యాచ్ కంటే వివాదాలే హైలైట్ గా నిలుస్తున్నాయి.
06:36 PM (IST) Jul 14
చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ శాలరీకే జాబ్ చేస్తుంటారు. చాలీచాలని జీతంతో జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ బిజినెస్ ఐడియాస్. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ఆ బిజినెస్ లు ఏంటో తెలుసుకుందామా..
05:38 PM (IST) Jul 14
ఎంత కాదన్నా ప్రతీ ఒక్కరూ చదువుకునేది ఉద్యోగం కోసమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ మంచి జీతం ఉన్న ఉద్యోగాన్ని పొందాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అత్యధికంగా జీతాలు వచ్చే కొన్ని ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
05:36 PM (IST) Jul 14
IND vs ENG: లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి అంచుకు జారుకుంది. ఇంగ్లాండ్ ఉంచిన 193 పరుగుల టార్గెట్ ముందు కెప్టెన్ శుభ్ మన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలు భారత్ ను దెబ్బకొట్టాయని విశ్లేషకులు, క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
04:57 PM (IST) Jul 14
ముందు ఉద్యోగం, ఆ తర్వాత వ్యాపారం.. ఒకప్పుడు యువత ఆలోచన ఇలా ఉండేది. అయితే ఇప్పుడు మారిన కాలానికి అనుగుణంగా యువత ఆలోచన కూడా మారుతోంది. చదువు పూర్తికాగానే వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఒక మంచి బిజినెస్ ఐడియా..
04:26 PM (IST) Jul 14
తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా నిర్వహించే రంగం కార్యక్రమం గురించి మీకు తెలుసా? అమ్మవారి మాటలుగా మాతంగి చెప్పే భవిష్యవాణి నిజమవుతుందా? బాబా వంగా భవిష్యత్ గురించి ఎలా చెప్పేవారు?
03:48 PM (IST) Jul 14
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విషయం తెలిసిందే. రెండు వారాల తర్వాత ఆయన భూమిపైకి తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
02:34 PM (IST) Jul 14
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం కేంద్రం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది.
02:19 PM (IST) Jul 14
ప్రస్తుతం క్రెడిట్ వినియోగం అనివార్యంగా మారింది. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ క్రెడిట్ కార్డు ఉంటోన్న రోజులివీ. అయితే రూ. 10 కోట్ల లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్ ఉన్న కార్డు గురించి మీకు తెలుసా.?
01:37 PM (IST) Jul 14
హైదరాబాద్ బోనాల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు రానున్నాయి. కొందరికి వరుసగా రెండురోజులు, మరికొందరికి మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఎవరికెన్ని సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
12:37 PM (IST) Jul 14
భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేం. కేవలం ఆడంబరానికి మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా బంగారాన్ని చాలా మంది చూస్తుంటారు. అందుకే బంగారం ధరకు సంబంధించి ఆసక్తి చూపిస్తుంటారు.
11:53 AM (IST) Jul 14
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో అమరావతి ఒకటి. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో సరికొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రానుంది.
11:36 AM (IST) Jul 14
నిన్న సానియా మీర్జా, నేడు సైనా నెహ్వాల్… ప్రపంచాన్నే గెలిచిన ఈ హైదరాబాదీ ఆడపడుచులు జీవితంలో మాత్రం ఓడిపోయారు. వీరిద్దరూ విడాకులు తీసుకుని ఒంటరి అయ్యారు. తెలుగు బిడ్డలకు ఏమిటీ పరిస్థితి?
10:44 AM (IST) Jul 14
10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముందడుగు పడింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి.
09:51 AM (IST) Jul 14
బీర్, విస్కీకి సమానంగా వైన్‌కు సైతం డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఈ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా తయారీ మాత్రం లేదు. ఇందులో భాగంగానే తెలంగాణలో కొత్త వైన్ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలుస్తోంది.
08:49 AM (IST) Jul 14
భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
08:13 AM (IST) Jul 14
148 ఏళ్ల వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ లో అద్భుతం చేసాడు ఇటలీ ఆటగాడు సిన్నర్. తన దేశ చిరకాల కలను నెరవేర్చి క్రీడా ప్రపంచంలో నవ శకానికి నాంది పలికాడు. ఇంతకూ అతడు ఓడించింది ఎవరినో తెలుసా?