- Home
- Sports
- Cricket
- Ind vs Eng: గెలుపు కోసం ఎంతకు తెగించార్రా.. జడేజాతో ఇంగ్లాండ్ బౌలర్ దురుసు ప్రవర్తన..అంపైర్లపై అశ్విన్ ఆగ్రహం
Ind vs Eng: గెలుపు కోసం ఎంతకు తెగించార్రా.. జడేజాతో ఇంగ్లాండ్ బౌలర్ దురుసు ప్రవర్తన..అంపైర్లపై అశ్విన్ ఆగ్రహం
India vs England: లండన్‌లోని లార్డ్స్ లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో ఇరు జట్ల ప్లేయర్ల మధ్య ఉద్రిక్తతలలో ఉత్కంఠను పెంచాయి. మ్యాచ్ కంటే వివాదాలే హైలైట్ గా నిలుస్తున్నాయి.

లార్డ్స్ టెస్టులో మ్యాచ్ కంటే వివాదాలే ఎక్కువ
భారత్ - ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠను పెంచుతూ సాగింది. ఆటకంటే ఎక్కువగా వివాదాలే తెరపైకి వచ్చాయి.
తొలుత శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు ఇంగ్లాండ్ బ్యాటర్లు ఘాటు వాగ్వాదం చేయగా, చివరి రోజు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో ఇంగ్లాండ్ ప్లేయర్ల ఘటనపై పెద్ద దుమారం రేగింది.
జడేజాతో కార్స్ దురుసు ప్రవర్తన
38వ ఓవర్‌లో కార్స్ వేసిన నాలుగో బంతికి జడేజా క్విక్ రన్ కు ప్రయత్నించాడు. అయితే, కార్స్ జడేజా మార్గాన్ని అడ్డగించాడు. షార్ట్ రన్ తరువాత ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ మధ్యలోకి వచ్చి వాగ్వాదాన్ని ఆపే ప్రయత్నం చేశాడు.
ఈ సంఘటనపై క్రికెట్ వర్గాల్లో నైతికతపై చర్చ మొదలైంది. గెలుపు కోసం ఇలా ప్లేయర్లను అడ్డగించడమేంటని ఇంగ్లాండ్ ప్లేయర్లపై విమర్శలు వస్తున్నాయి. భారత క్రికెట్ లవర్స్ ఘాటుగానే స్పందిస్తున్నారు.
Clash between JADEJA & CARSE at the lords test day 5.#INDvsENGTest#LordsTestpic.twitter.com/pRIEBFClH9
— 269 | Ee Sala Cup Namdu (@kohlisphere_) July 14, 2025
భారత్ బ్యాటింగ్ విఫలం, గెలుపు కోసం జడేజా పోరాటం
భారత జట్టు ముందు ఇంగ్లాండ్ 193 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని చేధించడంలో భారత జట్టు మొదటినుంచి తడబడింది. 100 పరుగుల లోపలే 7 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ గిల్ (6), పంత్ (9), వాషింగ్టన్ సుందర్ (0), నితీశ్ రెడ్డి (13) సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. కేఎల్ రాహుల్ 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జడేజా క్రీజులో నిలకడగా ఆడుతూ గెలుపు ఆశలు రేపాడు.
అంపైర్ పౌల్ రైఫెల్‌పై అశ్విన్ విమర్శలు
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ అంపైర్ పౌల్ రైఫెల్ ఇచ్చిన పలు నిర్ణయాలు పెద్ద వివాదానికి దారితీశాయి. భారత జట్టు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ, “భారత బౌలింగ్ సమయంలో తేలికగా అవుట్ ఇవ్వరు, కానీ బ్యాటింగ్ సమయంలో చిన్న అనుమానాలకే అవుట్ ఇస్తున్నారు. ఇది సరైన విధానం కాదు” అని తన యూట్యూబ్ ఛానల్‌లో చెప్పారు.
అశ్విన్ ప్రస్తావించిన అంశాలలో, సిరాజ్ వేసిన ఎల్బీడబ్ల్యూ బంతి జో రూట్‌కు ఎదురుగా ఉండగా ‘అంపైర్ కాల్’ వల్ల నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు గిల్‌ను కార్స్ బౌలింగ్‌లో అవుట్ ఇచ్చారు, అయితే రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకలేదు అని స్పష్టంగా కనిపించింది. ఎంపైర్ కాల్ విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై అశ్విన్ ప్రశ్నలు లేవనెత్తారు.
తొలి ఇన్నింగ్స్ లో సమంగా.. రెండో ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ పై చేయి
లార్డ్స్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు సమంగా నిలిచాయ. తమ ఇన్నింగ్స్ లలో 387 పరుగులు చేశాయి. భారత్ తరపున కేఎల్.రాహుల్ సెంచరీ, జడేజా (72), పంత్ (74) రాణించారు. ఇంగ్లాండ్ తరపున జో రూట్ 104, జెమీ స్మిత్ 51, కార్స్ 56తో మెరిశారు. భారత బౌలింగ్‌లో బుమ్రా ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్ 192 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ముందు చిన్న టార్గెట్ ను ఉంచింది. అయితే, భారత బ్యాటర్లు రాణించకపోవడంతో 100 పరుగుల లూపే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరలో జడేజా భారత గెలుపు పై ఆశలు రేపాడు.