MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : తెలంగాణ స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త.. ఈ వీకెండ్ లో రెండు, కొందరికైతే మూడ్రోజుల సెలవులు?

School Holidays : తెలంగాణ స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త.. ఈ వీకెండ్ లో రెండు, కొందరికైతే మూడ్రోజుల సెలవులు?

హైదరాబాద్ బోనాల నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు రానున్నాయి. కొందరికి వరుసగా రెండురోజులు, మరికొందరికి మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఎవరికెన్ని సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 14 2025, 01:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈవారం కూడా వరుస సెలవులు
Image Credit : getty

ఈవారం కూడా వరుస సెలవులు

School Holidays : తెలంగాణలో ఆషాడ బోనాల సంబరాలు మొదలయ్యాయి. పల్లెలు, పట్నాలు అని తేడాలేదు... తెలంగాణ మొత్తం ఈ ఆషాడమాసంలో బోనాలు జరుగుతాయి. కానీ రాజధాని హైదరాబాద్ లో మాత్రం భారీఎత్తున జరిగే బోనాల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇప్పటికే ఈ పురాతన నగరంలో వెలిసిన అమ్మవార్లకు బోనాలను సమర్పించి మొక్కుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి.  ఈ పండగ నేపథ్యంలోనే వచ్చే సోమవారం తెలంగాణ లోని స్కూళ్లు, కాలేజీ విద్యార్థులతో పాటు ఉద్యోగులకు వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వచ్చే ఆది, సోమ రెండ్రోజులే సెలవే
Image Credit : getty

వచ్చే ఆది, సోమ రెండ్రోజులే సెలవే

తెలంగాణలో ఆషాడ మాసం బోనాల సందడి నెలకొంది... గోల్కొండ బోనాలతో హైదరాబాద్ లో వేడుకలు మొదలయ్యాయి. ఇప్పటికే బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలింది హైదరాబాద్ నగరవ్యాప్తంగా జరుపుకునే బోనాల వేడుకలు. వచ్చే ఆదివారం అంటే జులై 20న జరిగే ఈ వేడుకల కోసం నగరం సిద్దమవుతోంది... అమ్మవార్ల ఆలయాలన్ని ముస్తాబవుతున్నాయి.

వచ్చే ఆదివారం హైదరాబాద్ ప్రజలంతా బోనాల వేడుకల్లో పాల్గొంటారు... ఆడబిడ్డలు బోనమెత్తి మొక్కు చెట్టించుకుంటారు. అమ్మవారిని మేకలు, కోళ్లు బలిచ్చి మటన్, చికెన్ తోని విందు బోజనాలు ఏర్పాటుచేస్తారు. కుటుంబసభ్యులు, చుట్టాలు, స్నేహితులు... ఇలా అందరూ కలిసి విందు, మందుతో సందడి చేస్తారు. ఇక పలహారం బండ్ల ఊరేగింపులు, పోతురాజులు డ్యాన్సులు, శివసత్తుల పూనకాలు... హైదరాబాద్ మొత్తం సందడి సందడిగా ఉంటుంది.

తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా బోనాల పండగను జరుపుకుంటారు కాబట్టి రెండ్రోజులు సెలవులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బోనాలు జరిగే ఆదివారం ఎలాగే సెలవే... అందుకే సోమవారం కూడా అధికారికంగా సెలవు ప్రకటించింది రేవంత్ సర్కార్. అంటే వచ్చే సోమవారం విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవు వస్తుందన్నమాట.

35
వారికి వరుసగా మూడ్రోజుల సెలవులు?
Image Credit : getty

వారికి వరుసగా మూడ్రోజుల సెలవులు?

వచ్చే ఆది, సోమవారం(జులై 20, 21న) రెండ్రోజులు తెలంగాణలో అధికారికంగా సెలవులే. ఇక శనివారం కూడా కొందరికి మరో సెలవు కలిసిరానుంది. అంటే హైదరాబాద్ లోని కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు జులై 19, 20, 21 మూడురోజులు సెలవులు వస్తున్నాయి.

హైదరాబాద్ లో ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు సాధారణంగా ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. వీరికి వచ్చే సోమవారం బోనాల సెలవు కలిసి రానుంది. కొన్ని కార్పోరేట్ విద్యాసంస్థలు, మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలోని ప్రాథమిక తరగతుల విద్యార్థులకు కూడా వారంలో రెండ్రోజుల సెలవులు ఉంటాయి. అలాంటి విద్యార్థులకు కూడా సోమవారం అదనంగా మరో సెలవు వస్తుంది. ఇలా బోనాల సందర్భంగా అందరికీ రెండ్రోజులు... కొందరికి మాత్రం మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి.

45
లాంగ్ వీకెండ్ కు మంచి ట్రిప్ ప్లాన్ చేయండి
Image Credit : iSTOCK

లాంగ్ వీకెండ్ కు మంచి ట్రిప్ ప్లాన్ చేయండి

ఆదివారంతో మరో రెండ్రోజుల సెలవులు కలిసివస్తున్నాయి... కాబట్టి బోనాల వేడుకలు మరింత ధూంధాంగా జరుపుకోవచ్చు. ఒకవేళ బోనాల పండగ జరుపుకోలేనివారు మూడ్రోజులపాటు అంటే ఈ లాంగ్ వీకెండ్ లో కుటుంబంతో లేదంటే స్నేహితులతో హాయిగా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుండి కేవలం ఒకట్రెండ్ రోజుల్లో చూసివచ్చే టూరిస్ట్ స్పాట్స్ అనేకం ఉన్నాయి. అలాంటి ప్రాంతాలను వెళ్లిరావచ్చు.

హైదరాబాద్ కు దగ్గర్లోని మంచి టూరిస్ట్ ప్రాంతాల గురించి తెలుసుకోవాలంటే ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి. ఇందులో మీకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి ఆనందంగా గడిపిరండి.

Hyderabad : ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగివచ్చేలా... హైదరాబాద్ దగ్గర్లో బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇవే

55
తెలంగాణోళ్లకు మాత్రమే సోమవారం సెలవు
Image Credit : unsplash

తెలంగాణోళ్లకు మాత్రమే సోమవారం సెలవు

తెలుగు సాంప్రదాయాలు, పండగలు, పర్వదినాలు ఒకటే కాబట్టి సాధారణంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఒకే రకమైన సెలవులు ఉంటాయి. కానీ ఈ బోనాల పండగ మాత్రం కేవలం తెలంగాణకే పరిమితం. అందుకే జులై 21న కేవలం తెలంగాలోనే సెలవు ఉంది. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు గుర్తించాలి... వారికి ఆరోజు ఎలాంటి సెలవు ఉండదు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
పండుగలు
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329 & 387
AUSAUS
(16.1 ov) 429 & 41/4
Day 5 - Session 1
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
వారికి వెంట‌నే చేయూత పింఛ‌న్‌.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం
Recommended image2
పేరుకు గ‌ర్ల్స్ హాస్ట‌ల్‌, లోప‌ల జ‌రిగేది మాత్రం వేరే క‌థ‌.. యువ‌తుల నుంచి అండాలను సేక‌రిస్తూ
Recommended image3
Rain Alert: హైద‌రాబాద్‌లో దంచికొట్టిన వ‌ర్షం.. ఈ ప్రాంతాల్లో మ‌రో 3 రోజులు వానలు
Related Stories
Recommended image1
School Holidays : ఆగస్ట్ లో తెలుగు స్టూడెంట్స్ కి సెలవులే సెలవులు... ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
School Holidays : దేశంలో మరెక్కడా లేవు.. తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ మూడ్రోజులు స్పెషల్ హాలిడేస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved