- Home
- Sports
- నిన్న సానియా మీర్జా, నేడు సైనా నెహ్వాల్... ప్రపంచాన్నే గెలిచిన హైదరాబాదీ ఆడబిడ్డలకు ఏమిటీ పరిస్థితి?
నిన్న సానియా మీర్జా, నేడు సైనా నెహ్వాల్... ప్రపంచాన్నే గెలిచిన హైదరాబాదీ ఆడబిడ్డలకు ఏమిటీ పరిస్థితి?
నిన్న సానియా మీర్జా, నేడు సైనా నెహ్వాల్… ప్రపంచాన్నే గెలిచిన ఈ హైదరాబాదీ ఆడపడుచులు జీవితంలో కాస్త సతమతమవుతున్నారు.

సానియా పరిస్థితే సైనాకు..
Saina Nehwal-Kashyap : అమ్మాయిలు ఎందులోనూ తక్కువకాదని నిరూపించిన మన హైదరబాదీ అమ్మాయిలు వివాదాలను ఎదుర్కొంటున్నారు. క్రీడాకారులుగా సక్సెస్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వివాహ బంధంలో సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పరిస్థితి బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కి ఎదురయ్యింది.
తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ను ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు సైనా. దశాబ్దాల స్నేహం, ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకెళ్లి ఏడేళ్ల క్రితం ఈ జంట ఒక్కటయ్యారు. అయితే కొంతకాలంగా ఈ హైదరాబాదీ బ్యాడ్మింటన్ జంట విడాకులపై ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా సైనా విడాకులపై క్లారిటీ ఇచ్చారు.
విడాకులపై సైనా ఎమోషనల్ పోస్ట్..
''ఒక్కోసారి జీవితం మనల్ని వివిధ మార్గాల్లోకి తీసుకెళుతుంది. చాలా ఆలోచనలు, చర్చల తర్వాత పారుపల్లి కశ్యప్ తో విడాకులు తీసుకునేందుకు సిద్దమయ్యా. మా ఇద్దరి దారులు వేరు కానున్నాయి. మేము పరస్పరం ఇష్టపడి విడిపోతున్నాం... కాబట్టి జీవితంలో శాంతి, ప్రశాంతత ఉండి మరింత ఉన్నతస్థాయికి ఎదరగాలని ఒకరి గురించి ఒకరం కోరుకుంటున్నాం.'
‘’కశ్యప్ తో చాలా జ్క్షాపకాలున్నాయి... ఎన్నో తీపిగుర్తులు ఉన్నాయి. కానీ విడిపోయి ముందుకు సాగుతామని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని అర్థం చేసుకుని ఈ సమయంలో తమ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నాం'' అంటూ సైనా సోషల్ మీడియా వేదికన ఎమోషనల్ గా విడాకుల ప్రకటన చేశారు.
14 ఏళ్ల ప్రేమ, 7 ఏళ్ల వివాహ బంధం
చిన్నప్పటినుండి బ్యాడ్మింటన్ ను ఇష్టపడే సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ మొదటిసారి 1997లో కలుసుకున్నారు. బ్యాడ్మింటన్ శిక్షణా శిబిరం వీరిద్దరినీ కలిపింది… అప్పుడు ఇద్దరూ చిన్నపిల్లలే.. వీరి మధ్య స్నేహం పెరిగింది. అయితే 2002 నుంచి వీరిద్దరూ తరచుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. 2005లో హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకునే సమయంలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఇలా ఇద్దరి మనసులు కలవడంతో ప్రేమలో పడ్డారు.
దశాబ్దానికి పైగా (14 ఏళ్ళు) ప్రేమాయణం సాగించిన వీరు డిసెంబర్ 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెద్దల సమక్షంలో సైనా, కశ్యప్ పెళ్లిచేసుకున్నారు... కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల మధ్య ఎలాంటి హడావిడి లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. జీవితాంతం కలిసి జీవించాలని భావించిన ఈ జంట ఇప్పుడు విడిపోయింది.
సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు
హైదరాబాద్ కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఇలాగే ఓ క్రీడాకారున్ని ఇష్టపడి పెళ్లాడినా జీవితాంతం కలిసుండలేక విడాకులు తీసుకుంది. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్ళాడిన సానియా ఓ కొడుకు పుట్టినతర్వాత విడాకులు తీసుకుంది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సానియా-షోయబ్ ఖులా (భార్యాభర్తలు ఇష్టపూర్వకంగా విడిపోవడం) తీసుకున్నట్లు ప్రకటించారు.
సానియాకు పాక్ క్రికెటర్ షోయబ్ తో 2010 లో వివాహం జరిగింది. వీరి జీవితం కొంతకాలం సాఫీగానే సాగింది... దీంతో ఓ కొడుకు జన్మించాడు. అయితే షోయబ్ జీవితంలోకి సనా జావెద్ ఎంటర్ అవడంతో వీరి జీవితంలో అలజడి రేగినట్లు తెలుస్తోంది. దీంతో సానియా భర్తకు విడాకులు ఇచ్చింది.
ప్రపంచాన్ని గెలిచిన హైదరాబాద్ అమ్మాయిలకి ఏమిటీ పరిస్థితి?
భారతీయ అమ్మాయిలు క్రీడల్లోనూ అద్భుతాలు చేయగలరని నిరూపించారు సానియా, సైనా. సాంప్రదాయ కుటుంబాల నుండి వచ్చిన ఈ ఇద్దరు హైదరబాద్ అమ్మాయిలు ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ప్రపంచాన్ని గెలిచారు... ఎందరో అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు.. కానీ వ్యక్తిగత వివాహ జీవితంతో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు..
సానియా మీర్జా వివాహం నుండి విడాకుల వరకు వివాదాస్పదమే... ఆమె పాక్ క్రీడాకారుడికి పెళ్లాడటం చాలామంది ఇండియన్స్ కు నచ్చలేదు. అయితే అది ఆమె వ్యక్తిగత జీవితం కాబట్టి ఎవరూ ఎక్కువ మాట్లాడలేదు. కానీ విడాకుల సమయంలో మాత్రం దుమారం రేగింది... ఈ సమయంలో సానియాకు యావత్ దేశం మద్దతుగా నిలిచింది.
సైనా నెహ్వాల్ తన ప్రొపెషనల్ జీవితంలాగే పర్సనల్ లైఫ్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. తనకు బాగా తెలిసినవాడు, సేమ్ తనలాగే బ్యాడ్మింటర్ ప్లేయర్ అయిన పారుపల్లి కశ్యప్ ను విహాహమాడింది. కానీ ఏమయ్యిందో కానీ వీరిద్దరు తాజాగా విడాకులకు సిద్దమయ్యారు. దీంతో మన తెలుగింటి ఆడబిడ్డల జీవితాలు ఎందుకిలా తయారవుతున్నాయి? ఏమిటీ పరిస్థితి? అంటూ క్రీడాప్రియులే కాదు సామాన్య తెలుగు ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.