చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

By Siva KodatiFirst Published Aug 23, 2019, 1:13 PM IST
Highlights

ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చిదంబరం తరపున కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. 

ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసులో మాత్రం చిదంబరానికి ముందస్తు బెయిల్ లభించింది.

చిదంబరం తరపున కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి రక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌‌పై శుక్రవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. చిదంబరానికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఆగస్టు 26 (సోమవారం) వరకు ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేయరాదని స్పష్టం చేసింది. కానీ చిదంబరం విచారణకు మాత్రం సహకరించాలని సూచించింది. ఈడీ, సీబీఐ రెండు కేసులపైనా సోమవారం విచారణ జరుపుతామని వెల్లడించింది. ఆయన అరెస్ట్ సందర్భంగా సీబీఐ నిబంధనలు పాటించలేదని కపిల్ సిబాల్ ఆరోపించారు.

నాలుగు రోజుల కస్టడీని ఛాలెంజ్ చేసిన చిదంబరం న్యాయవాదులు... ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, ఈడీ ఎలాంటి అఫిడవిట్‌ను దాఖలు చేయలేదని వాదించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి మక్కికి మక్కీ కాపీ చేశారని సిబాల్ ఆరోపించారు. 

ఒక్కరి కోసం తండ్రి, కొడుకుల అడ్డదారులు... వందల కోట్ల అక్రమార్జన

ఐఎన్ఎక్స్ కేసులో ముగిసిన వాదనలు: తీర్పుపై ఉత్కంఠ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం కేసు విచారిస్తున్న అధికారి బదిలీ

నాటి సెగ....నేడు పగ: దేవుడు రాసిన స్క్రిప్ట్ లో షా, చిదంబరం

చిదంబరం అరెస్ట్: రాత్రికి సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లోనే

రాజకీయ కుట్రే: చిదంబరం అరెస్ట్‌పై కార్తీ

కేంద్ర మాజీమంత్రి చిదంబరం అరెస్ట్ : సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలింపు

చిదంబరం ఇంటి వద్ద హైడ్రామా: గేట్లు ఎక్కి ఇంట్లోకి వెళ్లిన సీబీఐ అధికారులు

కాంగ్రెస్ కార్యాలయం వద్ద హైడ్రామా: సీబీఐని అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

అజ్ఞాతం వీడిన చిదంబరం: తన కుటుంబంపై కుట్ర జరుగుతోందని ఆరోపణలు

చిదంబరానికి చుక్కెదురు: ముందస్తు బెయిల్‌పై శుక్రవారం విచారణ

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరం లింకులు ఇవీ.....

ఐఎన్ఎక్స్ కేసు:చిదంబరానికి చుక్కెదురు, అరెస్ట్ తప్పదా?

చిదంబరంపై లుక్‌అవుట్ నోటీసులు... ఏ క్షణమైనా అరెస్ట్

సీజేఐ వద్దకు బెయిల్ పిటిషన్, మధ్యాహ్నం తేలనున్న చిదంబరం భవితవ్యం

ఐఎన్ఎక్స్ మీడియా కేసు: అజ్ఞాతంలోకి చిదంబరం, గాలిస్తున్న సీబీఐ

కూతురిని హత్య చేసిన ఆమె... చిదంబరాన్ని పట్టించింది..!

click me!