ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంలో పిటిషన్లు: కేంద్రానికి నోటీసులు

By narsimha lodeFirst Published Aug 23, 2019, 12:54 PM IST
Highlights

ట్రిపుల్ తలాక్ బిల్లుపై దాఖలైన పలు పిటిషన్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఈ విషయమై కేంద్రానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లుపై దాఖలైన పలు పిటిషన్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.ఈ విషయమై కేంద్రానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.ఈ చట్టాన్ని సమీక్షించాలని పిటిషనర్లు కోరారు.ఈ విషయమై కోర్టు సానుకూలంగా స్పందించింది.

జస్టిస్ ఎన్వీరమణ, అజయ్ రస్తోంగీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ కు తెలిపింది.ట్రిపుల్ తలాక్ పై కేంద్రం చట్టం  చేసింది. ఇటీవలనే లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లు పాసైంది.ఈ చట్టంపై విపక్షాలు కొన్ని సవరణలు కోరాయి.కానీ ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు.

ఈ చట్టంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.సమస్త కేరళ జమాతే ఉల్  ఉలామా, సున్నీ ముస్లిం స్కాలర్స్ , అమిర్ రషీద్ మదానీ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టం రాజ్యాంగ బద్దంగా లేదని వారు ఆరోపిస్తున్నారు.

ట్రిపుల్ తలాక్ పేరుతో విడాకులు ఇచ్చిన వారికి శిక్షలు ఇవ్వడాన్ని పరిశీలించాలని పిటిషనర్లు కోరారు.ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు ప్రకటించింది.
 

click me!