Published : May 10, 2025, 06:25 AM IST

Telugu news live updates: India Pakistan Tensions: జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు.. బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి

సారాంశం

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్:  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ఇండియా పాకిస్థాన్ యుద్దవాతావరణం, ఆపరేషన్ సిందూర్ వార్తలతో పాటు  లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌  అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 

 

 

 

12:29 AM (IST) May 11

India Pakistan Tensions: జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు.. బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మృతి

India Pakistan Tensions: పాకిస్తాన్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరణించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ డ్రోన్లను భారత గగనతలంలోకి పంపడం ద్వారా దాన్ని ఉల్లంఘించింది, దీంతో అనేక ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతోంది.

పూర్తి కథనం చదవండి

11:23 PM (IST) May 10

India Pakistan: కాల్పుల విరమణ ఉల్లంఘన.. పాకిస్తాన్ కు భార‌త్ వార్నింగ్

 

Pakistan violates ceasefire: కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే పాకిస్తాన్ భారతదేశంతో కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూకాశ్మీర్ లో మ‌రోసారి దాడుల‌కు పాల్ప‌డటంతో పాకిస్తాన్ కు భారత్ వార్నింగ్ ఇచ్చింది. 

పూర్తి కథనం చదవండి

10:18 PM (IST) May 10

India-Pakistan Ceasefire: అబద్దాల కోరు.. పాకిస్తాన్ నిజస్వరూపం బట్టబయలు.. పాక్ చెప్పిన 14 అబద్ధాలు ఇవిగో

India-Pakistan Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బోలెడు అబ్దాలు చెప్పింది. అయితే, ఇండియన్ ఆర్మీ అన్నిటినీ నిజాలతో బట్టబయలు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

09:28 PM (IST) May 10

India Pakistan: పాకిస్తాన్ కుటిల బుద్ది.. మ‌ళ్లీ భారత్ పైకి పాక్ డ్రోనులు.. గంటల్లోనే కాల్పుల విరమణ ఉల్లంఘనలు

India Pakistan: పాకిస్తాన్ మ‌రోసారి త‌న‌ కుటిల బుద్దిని చూపించింది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి ఒకే చెప్పిన కొన్ని గంట‌ల్లోనే భార‌త్ పైకి డ్రోన్ల‌తో దాడుల‌కు దిగింది. శ్రీన‌గ‌ర్ స‌హా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్ప‌డింద‌ని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 

పూర్తి కథనం చదవండి

08:45 PM (IST) May 10

India Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణపై ప్రపంచ మీడియా స్పందన ఇదే..

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ ముందు తలొగ్గింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి, యుద్ధం ఆగిపోయింది. ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థలు దీనిపై ఎలా స్పందించాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

పూర్తి కథనం చదవండి

08:38 PM (IST) May 10

Zodiac sign: 4 రోజులు ఓపిక పడితే చాలు.. ఈ రాశుల వారి జీవితం మారనుంది

మే 14, 2025న సూర్యుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ మార్పుతో 4 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సంతోషం, ధనలాభం కలుగుతుంది. ఆ నాలుగు రాశులు ఏంటి.? వారీ జీవితంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

08:34 PM (IST) May 10

India Pakistan Ceasefire: భార‌త్ పాకిస్తాన్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ‌.. అంటే ఏమిటి? ఇప్పుడు ఏం జ‌రుగుతుంది?

India Pakistan Ceasefire: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదిరింది. దాదాపు ఇరు దేశాల మ‌ధ్య యుద్ధం ముగిసిన‌ట్టే. అస‌లు ఏంటి ఈ కాల్పుల విర‌మ‌ణ‌? ఇప్పుడు ఏం జ‌రుగుతుంది? గ‌త‌ చరిత్ర, ఉల్లంఘనలు స‌హా ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకోసం.  
 

పూర్తి కథనం చదవండి

08:21 PM (IST) May 10

మేకప్ లేకుండా బాలీవుడ్ సింగిల్ మదర్స్.. వామ్మో ఇలా ఉన్నారేంటి?

బాలీవుడ్‌లో చాలా మంది నటీమణులు సింగిల్ మదర్స్‌గా పిల్లల్ని పెంచుతున్నారు. మేకప్ లేకుండా వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ చూడండి.

పూర్తి కథనం చదవండి

08:17 PM (IST) May 10

Car: రూ. ల‌క్ష చెల్లించి మీ సొంత కారు క‌ల నిజం చేసుకోండి..

కారు కొనుగోలు చేయ‌డం అనేది చాలా మందికి ఒక క‌ల లాంటిది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గానికి చెందిన వారు మాత్రమే కారు గురించి ఆలోచించే వారు. కానీ ప్రస్తుతం మధ్య తరగతి కుటుంబాలు కూడా కారును కొనుగోలు చేస్తున్నారు. నెలకు కేవలం రూ. 6 వేలు ఈఎమ్ఐ చెల్లించి కొత్త కారును సొంతం చేసుకోవచ్చు. అలాంటి ఒక బెస్ట్ కారు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

07:49 PM (IST) May 10

India Pakistan War: పెళ్లైన ముడ్రోజులకే.. దేశ రక్షణ కోసం నా సింధురాన్ని పంపుతున్నా.. జవాను భార్య వీడియో వైరల్

Indian Soldier Returns to Border Days After Wedding: మహారాష్ట్ర పాచోరాకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌ పెళ్లైన మూడు రోజులకే దేశ రక్షణ కోసం బోర్డర్‌కు తిరిగి వెళ్లారు. భార్య యామిని కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతూ 'దేశ ర‌క్షణ కోసం త‌న సింధూరాన్ని పంపుతున్నానంటూ' ఎమోష‌న‌ల్ అయ్యారు. 
 

పూర్తి కథనం చదవండి

07:00 PM (IST) May 10

India vs Pakistan: యుద్ధం ముగిసింది మ‌రి నెక్ట్స్ ఏంటి.? మే 12న కీల‌క చ‌ర్చ‌లు

జమ్మూకశ్మీర్‌లో ఏప్రిల్‌ 22న పహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న దాడి తర్వాత భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగాయి. ఈ క్రమంలో రెండు దేశాలు పరస్పరం దాడులకు కూడా దిగాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులకు శనివారం (మే 10)తో తెరపడింది.
 

పూర్తి కథనం చదవండి

06:57 PM (IST) May 10

India Pakistan War: పాకిస్తాన్ డ్రోన్ దాడులకు డీఆర్డీవో చెక్.. ఏంటి ఈ ఇండియ‌న్ డోమ్ టెక్నాల‌జీ?

India Pakistan War: డీఆర్డీవో (DRDO) అభివృద్ధి చేసిన డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ పాకిస్తాన్ డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటూ భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియ‌న్ డోమ్ టెక్నాల‌జీ భార‌త న‌గ‌రాల‌ను సుర‌క్షితంగా ఉంచుతోంది. పాక్ దాడికి చెక్ పెడుతున్న డీఆర్డీవో టెక్నాల‌జీ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

06:50 PM (IST) May 10

India Pakistan War: దేశ ఐక్య‌త‌ను దెబ్బ‌తీస్తే ఊరుకోం.. ఇండియ‌న్ ఆర్మీ

గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్‌ల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక‌త్త వాతావ‌ర‌ణానికి ఫుల్ స్టాప్ ప‌డింది. భారత్‌, పాకిస్థాన్‌లు కాల్పుల విర‌మ‌ణ‌కు అంగీక‌రించిన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆర్మీ అధికారులు ప్ర‌క‌టించారు. 
 

పూర్తి కథనం చదవండి

06:37 PM (IST) May 10

IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ మూడు నగరాల్లోనే పూర్తి టోర్నీమెంట్

IPL 2025: ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్ లను మూడు వేదికల్లోనే నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది. 
 

పూర్తి కథనం చదవండి

05:59 PM (IST) May 10

India Pakistan War: పోఖ్రాన్‌పై దానికి యత్నించిన పాక్ డ్రోన్ ను కూల్చేసిన భారత్

India Pakistan War : పోఖ్రాన్‌పై పాకిస్తాన్ డ్రోన్ దాడిని భారత వాయుసేన భగ్నం చేసింది. రాజస్థాన్ సరిహద్దుల్లో రెడ్ అలర్ట్‌తో పాటు రాత్రివేళ బ్లాక్‌ఔట్ అమలు  చేస్తున్నారు. 
 

పూర్తి కథనం చదవండి

05:51 PM (IST) May 10

India Pakistan War: భార‌త్ పాక్‌ల మ‌ధ్య యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచ‌ల‌న ట్వీట్

భార‌త్, పాకిస్థాన్‌ల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. రోజురోజుకీ ప‌రిస్థితులు చేజారిపోతూ వ‌చ్చాయి. ఒకానొక స‌మ‌యంలో పాకిస్థాన్ అణు దాడికి దిగుతుంద‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇంత‌కీ ఆ ప్ర‌క‌ట‌న ఏంటంటే.. 
 

పూర్తి కథనం చదవండి

05:25 PM (IST) May 10

కరిష్మా మేకప్ లేకుండా.. షాక్ లో ఫ్యాన్స్

మేకప్ లేకుండా కనిపించిన కరిష్మా కపూర్ ని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

05:16 PM (IST) May 10

India Pakistan War: స్వగ్రామానికి చేరుకున్న వీర జవాన్, మురళి పార్థివ దేహం

జమ్మూలో పాక్ జరిపిన దాడిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చి, స్వగ్రామానికి పంపించారు.

పూర్తి కథనం చదవండి

05:13 PM (IST) May 10

నా జీవితంలో కష్టాల నుంచే పాఠాలు నేర్చుకున్నా.. సమంత కామెంట్స్ 

విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన కష్టాలు, వాటి నుంచి నేర్చుకున్న పాఠాల గురించి సమంత మాట్లాడింది. 

పూర్తి కథనం చదవండి

05:06 PM (IST) May 10

India Pakistan War: పెళ్లైన మరునాడే యుద్ధ భూమికి జవాన్..

ఇండో-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో, వైమానిక దళ జవాన్ మోహిత్ రాథోడ్ తన పెళ్లి మరుసటి రోజే విధి నిర్వహణకు బయలుదేరారు. జవాన్ చేసిన ఈ పనికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

పూర్తి కథనం చదవండి

04:47 PM (IST) May 10

India Pakistan War: మ‌రో దాడి జ‌రిగితే యుద్ధంగా ప‌రిగ‌ణిస్తాం.. పాక్‌కు భార‌త్ హెచ్చ‌రిక

పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయం చేస్తున్నట్టు భారత్ బయటపెట్టడంతో ఉద్రిక్తతలు పెరిగాయి.

పూర్తి కథనం చదవండి

04:42 PM (IST) May 10

Share Market: జస్ట్ రూ.500తో మొదలు పెట్టింది. రూ.2 కోట్లు సంపాదించింది: ఇది ట్రేడింగ్ మహిళ సక్సెస్ స్టోరీ

Share Market: ఐటీ ఉద్యోగి అయిన ఒక అమ్మాయి కేవలం రూ.500తో షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి ఏకంగా రూ.2 కోట్లకు పైగా పోర్ట్‌ఫోలియోను సృష్టించింది. అంతేకాకుండా రిస్క్ తీసుకొని రూ.3 లక్షల రుణం తీసుకుని ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడం ఆమెను గేమ్ ఛేంజర్ గా నిలబెట్టింది. ఆమె ఇప్పుడు ఇంట్రాడే, ఆప్షన్ ట్రేడింగ్‌లో దూసుకుపోతూ ప్రొఫెషనల్స్ నే ఆశ్చర్యపరుస్తోంది. ఈ సక్సస్ ఫుల్ మహిళ విజయం గురించి మరిన్ని వివరాలు ఇవిగో.

పూర్తి కథనం చదవండి

04:39 PM (IST) May 10

ప్రదీప్ రంగనాథన్ కొత్త మూవీ టైటిల్ డ్యూడ్, హీరో సూర్యతో పోటీకి రెడీ 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన 'డ్యూడ్' సినిమా 2025 దీపావళికి విడుదలవుతోంది. కీర్తిస్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

పూర్తి కథనం చదవండి

04:26 PM (IST) May 10

రవి మోహన్ తో విడాకుల వివాదం.. ఆర్తికి ఖుష్బూ, రాధికా మద్దతు

నటుడు రవి మోహన్, అతని భార్య ఆర్తి మధ్య విడాకుల వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. వేర్వేరుగా జీవిస్తున్నారు. రవిమోహన్ తండ్రిగా తన బాధ్యతలని మర్చిపోతున్నాడు అంటూ ఆర్తి ఎమోషనల్ గా ఆరోపణలు చేసింది.

పూర్తి కథనం చదవండి

04:24 PM (IST) May 10

India Pakistan War: భార‌త్ POKని తిరిగి తీసుకోగ‌ల‌దా.? దీని వెన‌కాల ఉన్న స‌మ‌స్య‌లు ఏంటి

1971 త‌ర్వాత మ‌ళ్లీ భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య ఈ స్థాయి ఉద్రిక్త‌త‌లు నెల‌కొన‌డం ఇదే తొలిసారి అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. రెండు దేశాల మ‌ధ్య దాదాపు యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న నేప‌థ్యంలో తాజాగా పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ అంశం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. భార‌త్ పీఓకేను తిరిగి తీసుకోవాల‌నే డిమాండ్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఇది ఎంత వ‌ర‌కు సాకార‌మ‌వుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

పూర్తి కథనం చదవండి

03:56 PM (IST) May 10

Summer Tips: వేసవిలో కార్ ఇంటీరియర్‌ చల్లగా ఉండాలంటే ఈ 7 టిప్స్ పాటించండి

Summer Tips: వేసవిలో కార్‌ను బయట పార్క్ చేసినప్పుడు ఇంటీరియర్ వేడిగా మారడం మామూలే. కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కారును వేడి నుంచి కాపాడవచ్చు. దీంతో వేసవిలో కూడా కార్‌ చల్లగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

03:30 PM (IST) May 10

India Pakistan War: పాకిస్థాన్‌కు ద‌బ్బిడి దిబ్బిడే.. మూడు వైపుల నుంచి ముంచుకొస్తున్న ముప్పు

ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. భార‌త్‌పై దాడులు చేస్తూ క‌య్యానికి కాలు దూస్తున్న పాక్‌కు సొంత దేశంలోనే గ‌డ్డు ప‌రిస్థితులు ఉన్నాయి. అస‌లు పాక్ అస్తిత్వ‌మే ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది. ఇంత‌కీ పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఆ గ‌డ్డు ప‌రిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:01 PM (IST) May 10

India Pakistan War ;ఆపరేషన్ సిందూర్‌లో లో చనిపోయిన టాప్ 5 టెర్రరిస్టులు వీళ్లే

ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ చేపట్టిన దాడుల్లో చాలామంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే తాజాగా అందులో కొందరు కీలక ఉగ్రవాదుల పేర్లు బయటకు వచ్చాయి. వారు ఎవరో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

02:53 PM (IST) May 10

Mahindra Thar 2025: కేవలం రూ.11.50 లక్షలకే మహీంద్రా థార్.. ప్రత్యేకంగా యూత్ కోసమే ఈ మోడల్

Mahindra Thar 2025: మహీంద్రా కంపెనీ యువత కోసం ప్రత్యేకంగా థార్ 2025 న్యూ మోడల్ ని సిద్ధం చేసింది. దీన్ని ప్రత్యేకంగా యువత కోసం డిజైన్ చేసినట్లు మహీంద్రా తెలిపింది. పాత థార్ కి 2025 మోడల్ కి ఉన్న తేడాలు, యూత్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.   

పూర్తి కథనం చదవండి

02:45 PM (IST) May 10

Fake currency: ఏటీఎమ్‌లో న‌కిలీ నోటు వ‌స్తే ఏం చేయాలో తెలుసా.?

ATM: ప్రస్తుతం నకిలీ నోట్లు భారీగా పెరుగుతున్నాయి. అధికారులు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా అక్రమార్కులు మాత్రం నకిలీ నోట్లను మార్కెట్లోకి పెద్ద ఎత్తున సర్క్యూలేట్ చేస్తున్నారు. ఒకవేళ మీ చేతిలోకి నకిలీ నోటు వస్తే ఏం చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

02:20 PM (IST) May 10

రజనీకాంత్ జైలర్ 2 కోసం బాలకృష్ణ రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే ఫ్యూజులు అవుట్

రజనీకాంత్ నటించిన జైలర్ 2 చిత్రంలో క్యామియో పాత్రలో నటించడానికి బాలకృష్ణ అడిగిన పారితోషికం ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది.

పూర్తి కథనం చదవండి

02:13 PM (IST) May 10

India Pakistan War: ట‌పాసులు కాలిస్తే జైలుకే.. ఆదేశాలు జారీ చేసిన పోలీసులు

భార‌త్ పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఆప‌రేష‌న్ సిందూర్‌కు ప్ర‌తీకారంగా పాకిస్థాన్ భార‌త్‌పై దాడుల‌కు దిగుతోంది. అయితే పాక్ దాడులను ఇండియ‌న్ ఆర్మీ ధీటుగా తిప్పుకొడుతోంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా హై అల‌ర్ట్ జారీ చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

02:09 PM (IST) May 10

India Pakistan War : ఇండియాతో పాక్ ఎక్కువ కాలం పోరాడలేదు: రిటైర్డ్ పాక్ ఆర్మీ ఆఫీసర్ సంచలనం

ఇండియా, పాకిస్తాన్ సైనిక సామర్థ్యాన్ని పోలుస్తూ రిటైర్డ్ పాకిస్తానీ ఎయిర్ మార్షల్ మసూద్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనికుల సంఖ్యలో వ్యత్యాసం, పెరుగుతున్న ఉద్రిక్తతలను ఆయన హైలైట్ చేశారు... ఈ క్రమంలోనే భారత్ ముందు పాకిస్థాన్ నిలవలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

పూర్తి కథనం చదవండి

01:55 PM (IST) May 10

India Pakistan War: ఆల‌యాలే ల‌క్ష్యంగా పాక్ దాడులు.. చింత‌పుర్ణి ఆల‌య స‌మీపంలో వింత వ‌స్తువు

భారతదేశం–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నడుమ, హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లా చింతపుర్ణి ఆలయం సమీపంలోని బెహద్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి పేలుడు శబ్దం సంభవించింది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రదేశం చుట్టూ విద్యుత్ సరఫరా నిలిపివేయబడి ఉండగా ఈ శబ్దం వినిపించింది.
 

పూర్తి కథనం చదవండి

01:49 PM (IST) May 10

అనిల్ కపూర్ విలన్‌గా నటించిన 6 సినిమాలు.. హాలీవుడ్ లో కూడా..

కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న 'నాగ్ జిల్లా' సినిమాలో విలన్ పాత్ర కోసం అనిల్ కపూర్ లేదా బాబీ డియోల్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అనిల్ కపూర్ గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించారు. ఆయన నటించిన 6 సినిమాల గురించి తెలుసుకుందాం...

పూర్తి కథనం చదవండి

01:41 PM (IST) May 10

అణుయుద్ధ ముప్పు: భారత్ ఏం చర్యలు తీసుకుంటోంది

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో అణుయుద్ధం గురించి చర్చ జోరందుకుంది. S-400 నుండి బ్రహ్మోస్, అగ్ని వంటి అత్యాధునిక ఆయుధాలతో శత్రుదేశాలను భారత్ నిలువరించగలదు.

పూర్తి కథనం చదవండి

01:40 PM (IST) May 10

ఒక్క పైసా వడ్డీ లేకుండా.. ష్యూరిటీ అవసరం లేకుండా.. రూ.5 లక్షల లోన్ పొందొచ్చు. ఎలాగంటే..

యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూ.5 లక్షల రుణం అందిస్తోంది. ఈ లోన్ పొందినవాళ్లు పైసా కూడా వడ్డీ కట్టక్కర్లేదు. ఎటువంటి ష్యూరిటీ కూడా పెట్టాల్సిన పని లేదు. ఈ లోన్ పొందడానికి ఎలాంటి అర్హతలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

 

పూర్తి కథనం చదవండి

01:34 PM (IST) May 10

India Pakistan War : పాకిస్తాన్ కు IMF లోన్.. నిర్ణయాత్మక ఓటింగ్ కు ఇండియా దూరమెందుకుంది?

పాకిస్తాన్ కు IMF లోన్ ఇవ్వడం పై ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి సహాయం చేసే దేశానికి డబ్బు ఇస్తే అంతర్జాతీయ సంస్థల పరువు పోతుందని అన్నారు. ఇలా అభ్యంతరం తెలిపిన ఇండియా ఓటింగ్ కు ఎందుకు దూరమయ్యిందో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

01:30 PM (IST) May 10

OperationSindoor: ఉద్రిక్తత తగ్గించడంలో భారతదేశం ముందడుగు వేయాలి

భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఉద్రిక్తత తగ్గించడంలో భారతదేశం ముందడుగు వేయాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. శాంతికి కట్టుబడి ఉండటమే భారతదేశం  నిజమైన బలం అని ఆమె అన్నారు.

పూర్తి కథనం చదవండి

12:58 PM (IST) May 10

India Pakistan War : హైఅలర్ట్ ... భారత్ వైపు కదులుతున్న పాక్ సైన్యం

పాకిస్థాన్ చర్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయని భారత వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఆందోళన వ్యక్తం చేసారు. పాక్ బలగాలు భారత్ వైపు కదులుతున్నాయని ఆమె తెలిపారు. 

 

 

పూర్తి కథనం చదవండి

More Trending News