MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ మూడు నగరాల్లోనే పూర్తి టోర్నీ

IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్డేట్.. ఆ మూడు నగరాల్లోనే పూర్తి టోర్నీ

IPL 2025: ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి బీసీసీఐ ప్రణాళికలు ప్రారంభించింది. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా తాత్కాలికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2025 మిగతా మ్యాచ్ లను మూడు వేదికల్లోనే నిర్వహించడానికి బీసీసీఐ సిద్దమవుతోంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : May 10 2025, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

IPL 2025 restart Update: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ 2025 సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు కార్యాచరణను ప్రారంభించినట్లు సమాచారం. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం టోర్నమెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.  

ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు 57 లీగ్ మ్యాచ్‌లు పూర్తి కాగా, 58వ మ్యాచ్‌గా ధర్మశాల వేదికగా మే 2న ప్రారంభమైన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను భద్రతా కారణాలతో 10.1 ఓవర్లకు రద్దు చేశారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఎయిర్‌స్పేస్‌పై ఆంక్షలు, వాయుసేన హడావిడి. పఠాన్‌కోట్, జమ్మూ, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో గగనతల హెచ్చరికల మధ్య విమాన రాకపోకలు నిలిపివేశారు. దీంతో పంజాబ్, ఢిల్లీ జట్లతో పాటు బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బందిని వందే భారత్ ప్రత్యేక రైల్లో ఢిల్లీకి తరలించారు. 

మూడు నగరాల్లో ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్ లు 

ఐపీఎల్ ను తిరిగి తాత్కాలికంగా వాయిదా వేయగా, వారం తర్వాత తిరిగి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మూడు దక్షిణ భారత నగరాలను ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు ఎంపిక చేసిందని సమాచారం.  చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలను ఈజీగా చేరుకునే గమ్యస్థానాలుగా గుర్తించి, మిగిలిన 16 మ్యాచ్‌లు అందులో క్వాలిఫయర్‌లు, ఎలిమినేటర్, ఫైనల్ లను ఈ మూడు వేదికల్లోనే నిర్వహించే అవకాశముంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి అనంతరం మాత్రమే ఖచ్చితమైన షెడ్యూల్ ఖరారవుతుంది.

35

ESPN క్రిక్‌ఇన్ఫో నివేదిక ప్రకారం, మే నెలలో ఐపీఎల్ 2025 టోర్నీ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఫ్రాంచైజీలకు ఈ విషయమై ముందుగానే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. మే 25 తర్వాత టోర్నమెంట్ విండో పొడిగిస్తే, విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి.
 

45

ప్రస్తుతానికి, ఎక్కువ మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు తిరిగి వెళ్లిపోయారు. జూన్ 11న జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఆసీస్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమవుతున్నాయి. అలాగే, ఇంగ్లాండ్ జట్టు జూన్ 20న భారత్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్‌లో పాల్గొననుంది.
 

55

విదేశీ ఆటగాళ్లు మే లోపు అందుబాటులో ఉంటారని ఫ్రాంచైజీలు విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, మే 25 తర్వాత కూడా  ఐపీఎల్ షెడ్యూల్ వుంటే ఆ ఆటగాళ్లు అందేబాటులో ఉంటే అవకాశం వుండకపోవచ్చు.

టోర్నమెంట్‌ మళ్లీ ప్రారంభమైతే, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ జరగకుండా ఉండే అవకాశముంది, ఎందుకంటే వేదికలు మారే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో ఇది స్పష్టమవుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Recommended image2
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image3
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved