India Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణపై ప్రపంచ మీడియా స్పందన ఇదే..
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ ముందు తలొగ్గింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి, యుద్ధం ఆగిపోయింది. ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థలు దీనిపై ఎలా స్పందించాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్-పాక్ యుద్ధం ఆగింది
భారత్-పాకిస్తాన్ మధ్య 4 రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతకు బ్రేక్ పడింది. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత విదేశాంగ కార్యదర్శి, పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ శనివారం సాయంత్రం ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రపంచ మీడియా ఏం అంటోంది
కాల్పుల విరమణపై ప్రపంచ మీడియా స్పందించింది. అనేక వార్తా సంస్థలు భారత్-పాక్ యుద్ధ విరమణపై కథనాలు ప్రచురించాయి. వాటిపై ఓసారి లుక్కేద్దాం.
ది వాషింగ్టన్ పోస్ట్
భారత్-పాక్ కాల్పుల విరమణపై ది వాషింగ్టన్ పోస్ట్ రాస్తూ.. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని, దీన్ని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారని పేర్కొంది.
ది న్యూయార్క్ టైమ్స్
ది న్యూయార్క్ టైమ్స్ తన శీర్షికలో ట్రంప్ భారత్-పాక్ కాల్పుల విరమణను ప్రకటించారని, ఇరు దేశాల సైన్యాలు ఆకాశం, నీరు, భూమిపై కాల్పులు ఆపేందుకు అంగీకరించాయని రాసింది.
CNN వరల్డ్
CNN వరల్డ్ తన హోమ్ పేజీలో భారత్-పాక్ కాల్పుల విరమణపై శీర్షిక పెట్టి, కొన్ని రోజులుగా నెలకొన్న ఉద్రిక్తతకు కాల్పుల విరమణతో తెరపడిందని పేర్కొంది.
గ్లోబల్ టైమ్స్
చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ కూడా ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఈ విషయాన్ని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ వెల్లడించారని రాసింది.
అల్ జజీరా
ఖతార్ వార్తా సంస్థ అల్ జజీరా తన లైవ్ అప్‌డేట్‌లో భారత్-పాక్ యుద్ధ విరమణకు అంగీకరించాయని, దీంతో కాశ్మీర్ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోందని రాసింది.