MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Share Market: జస్ట్ రూ.500తో మొదలు పెట్టింది. రూ.2 కోట్లు సంపాదించింది: ఇది ట్రేడింగ్ మహిళ సక్సెస్ స్టోరీ

Share Market: జస్ట్ రూ.500తో మొదలు పెట్టింది. రూ.2 కోట్లు సంపాదించింది: ఇది ట్రేడింగ్ మహిళ సక్సెస్ స్టోరీ

Share Market: ఐటీ ఉద్యోగి అయిన ఒక అమ్మాయి కేవలం రూ.500తో షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి ఏకంగా రూ.2 కోట్లకు పైగా పోర్ట్‌ఫోలియోను సృష్టించింది. అంతేకాకుండా రిస్క్ తీసుకొని రూ.3 లక్షల రుణం తీసుకుని ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడం ఆమెను గేమ్ ఛేంజర్ గా నిలబెట్టింది. ఆమె ఇప్పుడు ఇంట్రాడే, ఆప్షన్ ట్రేడింగ్‌లో దూసుకుపోతూ ప్రొఫెషనల్స్ నే ఆశ్చర్యపరుస్తోంది. ఈ సక్సస్ ఫుల్ మహిళ విజయం గురించి మరిన్ని వివరాలు ఇవిగో.

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 10 2025, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

స్టాక్ మార్కెట్ లో ఏదైనా సాధ్యమే. ఎవరు ఎప్పుడు కోటీశ్వరుడు అవుతారో? ఎవరు ఎప్పుడు బికారిగా మారతారో వారికే తెలియదు. కాని తెలివితేటలు ఉపయోగించి ట్రేడింగ్ చేస్తే నష్టాల కంటే లాభాలే ఎక్కువ సాధించవచ్చని చాలా మంది ఇప్పటికే నిరూపించారు. ఇప్పుడు ఒక ఐటీ ఉద్యోగి అయిన అమ్మాయి ఈ సక్సెస్ మంత్రాన్ని సక్సెస్ ఫుల్ గా ఆచరించి చూపించింది. సెకండ్ ఇన్ కమ్ కింద కేవలం రూ.500తో షేర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టి ఆమె ఇప్పుడు ఏకంగా రూ.2 కోట్లకు పైగా పోర్ట్‌ఫోలియోను సృష్టించిందంటే ఆమె స్టాక్ మార్కెట్ లో ఎన్ని అద్భుతాలు చేసిందో అర్థం చేసుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ట్యూషన్ చెప్పుకుంటూ చదువుకొని..

ఈ మహిళా ట్రేడర్ పేరు కవిత. 14 ఏళ్ల వయసులోనే ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టింది. బంధువులు ఇచ్చే డబ్బును తల్లికి ఇచ్చి ఆమె నుంచి కూడా వడ్డీ తీసుకొనేదట. చిన్న వయసులోనే డబ్బు సంపాదనలో కిటుకులను తెలుసుకుంది కనుకే ఆమె సక్సెస్ ఫుల్ ట్రేడర్‌గా మారింది.

 

35

కష్టాలు వచ్చినా.. ధైర్యం కోల్పోలేదు

కాలేజీ సమయంలో తండ్రి హాస్టల్ ఫీజు కట్టలేకపోయారు. దాంతో కవిత రోజూ 3 గంటలు బస్సులో ప్రయాణించి చదువుకుంది. కానీ ఎప్పుడూ పరిస్థితులకు లొంగలేదు. ఆ ధైర్యమే ఆమెను గొప్ప ట్రేడర్‌గా మార్చింది.

ఆఫీసులో షేర్ మార్కెట్ పరిచయం

పుణేలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, కొంతమంది సహోద్యోగులు షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నట్లు కవిత గమనించింది. మొదట్లో దీన్ని సైడ్ ఇన్‌కమ్‌గా భావించి మొదలుపెట్టింది. కానీ త్వరగానే మార్కెట్ శక్తిని గ్రహించింది. ఆ తర్వాత ట్రేడింగ్‌ నే ప్రొఫెషన్ గా చేసుకుంది. 

45

రుణం తీసుకుంది, రిస్క్ చేసింది

ఒకానొక సమయంలో కవిత రూ.3 లక్షల రుణం తీసుకుంది. మొదట్లో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కానీ ఆమె పోర్ట్‌ఫోలియో రూ.20 లక్షలు దాటినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆమె పోర్ట్‌ఫోలియో ఏకంగా రూ.2 కోట్లకు పైగా ఉంది. దీన్ని బట్టి ఆమె ట్రేడింగ్ ఏ స్థాయిలో చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. 

55

ఇంట్రాడే క్వీన్ కవిత ట్రేడింగ్ స్టైల్ ఇది..

కవిత ఇప్పుడు వీక్లీ, మంత్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తుంది. ఆమె తనను తాను పొజిషనల్ ట్రేడర్‌గా మార్చుకుంది . అయితే ఆప్షన్ ట్రేడింగ్‌పై ఆమెకున్న అవగాహన చూసి ప్రొఫెషనల్స్ కూడా ఆశ్చర్యపోతారు. 'సానుకూల దృక్పథంతో ఉండటం, మార్కెట్‌ను క్లియర్ గా అబ్జర్వ్ చేయడమే తన సక్సెస్ మంత్రం అని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

గమనిక: షేర్ మార్కెట్ అనేది ఒక మాయాజాలం లాంటిది. ఇక్కడ సక్సెస్ కి ప్రత్యేకమైన దారి ఉండదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
స్టాక్ మార్కెట్
చిట్కాలు మరియు ఉపాయాలు
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image2
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Recommended image3
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Related Stories
Recommended image1
Mahindra Thar 2025: కేవలం రూ.11.50 లక్షలకే మహీంద్రా థార్.. ప్రత్యేకంగా యూత్ కోసమే ఈ మోడల్
Recommended image2
రూ.20,000 జీతం ఉన్న వాళ్లు కూడా కొనగలిగే 3 కార్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved