తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:55 PM (IST) Jun 02
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో 50 విజయాల మైలురాయిని అధిగమించిన ఐదో కెప్టెన్‌గా నిలిచాడు. అయ్యర్ సూపర్ నాక్ తో పంజాబ్ కింగ్స్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. టైటిల్ పోరులో ఆర్సీబీతో తలపడనుంది.
11:43 PM (IST) Jun 02
Mega Tsunami: కాస్కేడియా విభజన మండలిలో భారీ భూకంపం సంభవిస్తే, అమెరికా పశ్చిమ తీరాన్ని 1000 అడుగుల ‘మెగా సునామీ’ పూర్తిగా నాశనం చేస్తుందని తాజాగా ఒక అధ్యయనం హెచ్చరించింది.
11:27 PM (IST) Jun 02
Suryakumar Yadav: ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ ఏబీ డివిలియర్స్‌ను అధిగమించాడు. ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన నాన్-ఓపెనర్‌గా సూర్య ఘనత సాధించాడు.
11:22 PM (IST) Jun 02
వివిధ రకాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం భారతదేశం. మీరు వీటి గురించి, ఇవి పాటించే ప్రాంతాల ప్రజల గురించి తెలుసుకోవాలంటే ఇండియాలో ఎక్కడెక్కడికి వెళ్లాలో తెలుసా? ఆ ప్రదేశాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.
11:14 PM (IST) Jun 02
Gukesh vs Carlsen: నార్వే చెస్ 2025లో మ్యాగ్నస్ కార్ల్‌సన్‌పై భారత చెస్ గ్రాండ్ మాస్టర్ డీ.గుకేష్ విజయం సాధించాడు. అయితే, ఈ గెలుపు తర్వాత చోటుచేసుకున్న కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. ఆవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
10:34 PM (IST) Jun 02
అమెజాన్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ను తీసుకొచ్చింది. ఐఫోన్ 15-256 GB మోడల్ ను ఇప్పటివరకు ఎవరూ తగ్గించనంత తక్కువ ధరకు అందిస్తోంది. అమెజాన్‌లో భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు. దీని ధర, ఫీచర్లు ఓసారి చూద్దాం.
10:06 PM (IST) Jun 02
ప్రస్తుతం వ్యవసాయంలో రసాయన మందుల వాడకం ఎక్కువయిపోయింది. దీంతో మళ్లీ పాతకాలంలో మాదిరిగా ఆర్గానిక్ పద్దతిలో పండించే పంటలను డిమాండ్ పెరిగింది. ఇందుకోసం భూమిలోని పెస్టిసైడ్స్ ను తొలగించే పద్దతిని తెలంగాణ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
09:34 PM (IST) Jun 02
Nothing Phone 3: నథింగ్ ఫోన్ అంటే వెంటనే గుర్తొచ్చేది ట్రాన్సపరెన్సీ. ఈ బ్రాండ్ ను ప్రత్యేకంగా ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అందుకే కంపెనీ ఇప్పుడు ఫోన్ 3ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందామా?
09:16 PM (IST) Jun 02
నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే IPL 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. రెండు జట్లూ తమ తొలి IPL టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో పోటీ ఉత్కంఠభరితంగా ఉండనుంది.
08:23 PM (IST) Jun 02
Womens World Cup 2025 schedule: మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను సెప్టెంబర్ 30 నుంచి భారత్, శ్రీలంకలో ఐదు వేదికల్లో నిర్వహించనున్నారు. పాక్ జట్టు మ్యాచ్‌లు కొలంబోలో జరుగుతాయి.
07:05 PM (IST) Jun 02
Vivo: వివో నుంచి రెండు మడత పెట్టే ఫోన్లు వచ్చేస్తున్నాయ్. అవి వివో X200 FE, వివో X ఫోల్డ్5. ఈ మొబైల్స్ లాంచ్ డేట్, ఫీచర్స్, స్పెక్స్ లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం రండి.
06:35 PM (IST) Jun 02
Mibot: ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు జపాన్ కంపెనీ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మిబోట్ అనే పిలిచే ఈ బుల్లి కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
06:05 PM (IST) Jun 02
ముంబయ్ లో జరుగుతున్న ఓజీ షూటింగ్ కు సడెన్ గా బ్రేక్ ఎందుకు పడింది. పవన్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వకుండానే ఏపీకి తిరిగి ఎందుకు వచ్చారు. ముంబయ్ లో అసలు ఏం జరిగిందో తెలుసా?
05:59 PM (IST) Jun 02
కారు కొనుగోలు చేయాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే ఒక్కసారి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలన్న కారణంతో వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ ఈఎమ్ఐతో లేటెస్ట్, హైఎండ్ కారు ఒకటి అందుబాటులో ఉంది.
04:49 PM (IST) Jun 02
జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీటు సంపాదించాలని విద్యార్థులతో పాటు పేరెంట్స్ ఆశిస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా దేశ వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
04:19 PM (IST) Jun 02
కాళేశ్వరం ఎత్తిపోత ప్రాజెక్ట్‌పై విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు అధికారులను విచారించిన కమిషన్ ఇప్పుడు రాజకీయ నాయకులను విచారించడం ప్రారంభించింది.
03:48 PM (IST) Jun 02
అమెరికాలో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులను వీసా ఇంటర్వ్యూ సమయంలో ఏ యూనివర్సిటీలో సీటు లభించింది, ఏం చేయాలనుకుంటున్నారు.? లాంటి ప్రశ్నలు వేస్తారు. అయితే తాజాగా ఓ విద్యార్థికి మాత్రం వింత పరిస్థితి ఎదురైంది.
03:41 PM (IST) Jun 02
భారతదేశంలో వర్షాకాలం ఆరంభంలోనే ఘోరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వానలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి… తాజాగా కొండచరియలు విరిగిపడి ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
03:11 PM (IST) Jun 02
పెట్రోల్ ధరలు భరించలేక ఇబ్బందులు పడే వారికి బెస్ట్ ఆప్షన్ సీఎన్జీ కార్లు. ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే సీఎన్జీ కార్లు కూడా మార్కెట్ లో పెరుగుతున్నాయి. 10 లక్షల లోపు ధర ఉన్న నాలుగు సూపర్ సీఎన్జీ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
02:59 PM (IST) Jun 02
మనిషి రోజురోజుకీ శాస్త్రసాంకేతికంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా దూరాన్ని, కాలాన్ని జయించే దిశగా అడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శబ్ద వేగాన్ని మించే ప్రయాణానికి వీనస్ ఎయిరోస్పేస్ అనే సంస్థ నాంది పలుకుతోంది.
01:59 PM (IST) Jun 02
ప్రస్తుతం యువత స్కూటీలవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి వచ్చిన ఓ కొత్త స్కూటర్‌ను జనాలు పిచ్చిపిచ్చిగా కొనేస్తున్నారు. ఇంతకీ ఏంటా స్కూటర్, అందులో అంతలా ఏముందంటే..
01:18 PM (IST) Jun 02
హైదరాబాద్ నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. దేశంలోని నలుమూలల నుంచి హైదరాబాద్‌కు విద్య, ఉద్యోగ, వ్యాపారాల కోసం క్యూ కడుతున్నారు. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కూడా పెరుగుతోంది.
01:03 PM (IST) Jun 02
భారత గడ్డపై జరిగిన 2023 ప్రపంచకప్ లో ఆసిస్ ఆటగాడు మాక్స్ వెల్ విధ్వంసాన్ని క్రికెట్ ప్రియులు ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటిది అతడు వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడం ఆసిస్ ఫ్యాన్స్ నే కాదు క్రికెట్ ప్రియులకు కూడా షాకే.
12:40 PM (IST) Jun 02
బిడ్డలిద్దరి గొడవలో ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతోందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారా? అందుకే మధ్యేమార్గంగా పార్టీలో తనతోపాటు ప్రయానం సాగించిన హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగించాలని చూస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.
12:22 PM (IST) Jun 02
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
11:31 AM (IST) Jun 02
శర్మిష్ట పనోలి.. గత కొన్ని రోజులుగా ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. తాజాగా శర్మిష్టకు మద్ధతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా శర్మిష్ట గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు.
10:50 AM (IST) Jun 02
20 ఏళ్ల తర్వాత తొలిసారి ఇస్కాన్ జగన్నాథ రథ చక్రాలు మార్చారు. సాధారణంగా రథానికి చెక్క, రాయి చక్రాలను ఉపయోగించే వారు. అయితే తొలిసారి వీటికి బదులు సుఖోయ్ జెట్ చక్రాలు అమర్చారు.
10:01 AM (IST) Jun 02
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎవరెలా విషెస్ తెలిపారంటే…