పెట్రోల్ ధరలు భరించలేక ఇబ్బందులు పడే వారికి బెస్ట్ ఆప్షన్ సీఎన్జీ కార్లు. ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగానే సీఎన్జీ కార్లు కూడా మార్కెట్ లో పెరుగుతున్నాయి. 10 లక్షల లోపు ధర ఉన్న నాలుగు సూపర్ సీఎన్జీ SUVల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఎక్కువ దూరం ప్రయాణం చేస్తూ ఉంటారా? పెట్రోల్ ఖర్చులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే సీఎన్జీ మీకు మంచి ఆప్షన్. చిన్న సీఎన్జీ SUV కొనాలని మీరు అనుకుంటే ఈ నాలుగు కార్ల గురించి తెలుసుకోండి. 10 లక్షల లోపు ధరలోనే ఇవన్నీ దొరుకుతాయి.
హ్యుండై ఎక్స్‌టర్
హ్యుండై ఎక్స్‌టర్ సీఎన్జీ వేరియంట్‌లో కూడా వస్తుంది. 1.2 లీటర్ ఇంజిన్‌తో సీఎన్జీ మోడ్‌లో 69 bhp పవర్, 95.2 Nm టార్క్ ఇస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఎక్స్‌టర్ హై-సీఎన్జీ, హై-సీఎన్జీ డ్యూయో అనే రెండు సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. టాటా పంచ్ లాగానే డ్యూయో వేరియంట్‌లో డబుల్ సిలిండర్ సెటప్ ఉంటుంది. దీనివల్ల బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. రెండు వేరియంట్లలోనూ 60 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్
సీఎన్జీ కార్ల లిస్ట్‌లోకి కొత్తగా చేరింది నిస్సాన్ మాగ్నైట్. ఈ SUV ఇప్పుడు రెట్రోఫిట్ సీఎన్జీ ఆప్షన్‌లో కూడా దొరుకుతుంది. దీని సీఎన్జీ కిట్ ధర దాదాపు 75,000 రూపాయలు. ప్రభుత్వ అనుమతి పొందిన మోటోజెనమ్ కంపెనీ ఈ సీఎన్జీ కిట్ తయారు చేసింది. ఈ కిట్‌కి మూడు సంవత్సరాలు లేదా ఒక లక్ష కిలోమీటర్ల వారంటీ ఉంటుంది. ప్రభుత్వ అనుమతి ఉన్న ఫిట్టింగ్ సెంటర్లలో మాత్రమే దీన్ని ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంటుంది.
టాటా పంచ్
టాటా పంచ్ సీఎన్జీ వెర్షన్‌లో కూడా వస్తుంది. 1.2 లీటర్ రెవోట్రాన్ ఇంజిన్ కలిగిన ఈ కారు సీఎన్జీలో 73.4 bhp పవర్, 103 Nm టార్క్ ఇస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. కిలోమీటరుకి 26.99 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో డబుల్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో రెండు చిన్న సీఎన్జీ ట్యాంకులు కలిపి 60 లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనివల్ల సీఎన్జీ వెర్షన్‌లో కూడా 210 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. మీరు కావాలంటే పెట్రోల్, సీఎన్జీ మోడ్‌ల మధ్య ఈజీగా మారొచ్చు. డైరెక్ట్‌గా సీఎన్జీ మోడ్‌లో కూడా స్టార్ట్ చేయొచ్చు.
రెనాల్ట్ కిగర్
రెనాల్ట్ కిగర్ లో ఇప్పుడు సీఎన్జీ ఆప్షన్ కూడా వచ్చింది. మీరు సుమారు 80,000 రూపాయలు ఖర్చు పెడితే కంపెనీ వాళ్లే రెట్రోఫిట్ కిట్ ఇన్‌స్టాల్ చేస్తారు. ఈ కారులో 1.0 లీటర్ ఇంజిన్ ఉంది. అంతేకాకుండా 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. ఈ కిట్ గురించి కంపెనీ పెద్దగా వివరాలు ఇవ్వలేదు. కానీ మూడు సంవత్సరాల వారంటీ ఇస్తామని చెప్పారు.