తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
09:13 PM (IST) Jun 25
ఉత్తరాఖండ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదనీటిలో ఓ కారు కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో నాలుగు రోజుల చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
09:05 PM (IST) Jun 25
Voter ID card: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త విధానం ద్వారా ఓటర్ ఐడీ కార్డు ఇప్పుడు 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. ఈసీఐ కొత్త ఫాస్ట్ ట్రాక్ విధానమేంటి? అప్లికేషన్, ట్రాకింగ్ దశల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
08:02 PM (IST) Jun 25
AI powered gun: భారత సైన్యం 14,500 అడుగుల ఎత్తులో ఏఐ ఆధారిత మిషన్ గన్స్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రువులన, వారి టార్గెట్ లను స్వయంగా గుర్తించి ధ్వంసం చేస్తుంది.
07:51 PM (IST) Jun 25
జూన్ ఆరంభంనుండి ఎదురుచూస్తే నెల చివరికి వరుణుడు తెలుగు రాష్ట్రాలను కరుణిస్తున్నాడు. ఇకపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
07:46 PM (IST) Jun 25
హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న నటుడు మంచు విష్ణు కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ శాఖలు సంయుక్తంగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
06:27 PM (IST) Jun 25
హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన హత్య కేసు సంచలనం రేపుతోంది. పదో తరగతి చదువుతున్న ఒక బాలిక, తన ఇన్‌స్టాగ్రామ్ ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపిన ఘాతుకం ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది.
06:23 PM (IST) Jun 25
చంద్రబాబు పేరు, క్యూఆర్ కోడ్ తో సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంతకూ ఆ కార్యక్రమం ఎందుకోసమో తెలుసా?
05:32 PM (IST) Jun 25
ఇప్పటికే మారుతున్న సమాజంలో సంబంధాల మధ్య కూడా కొత్త ట్రెండ్‌లు కనిపిస్తున్నాయి. అందులో తాజా పేరు "హాట్ వైఫింగ్". ఇది పశ్చిమ దేశాల్లో పుట్టినప్పటికీ, ఇప్పుడు భారతదేశంలో కూడా చర్చకు వస్తోంది. ఇంతకీ కొత్త ట్రెండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
04:56 PM (IST) Jun 25
Rishabh Pant : లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో రెండు సెంచరీలు బాదిన రిషబ్ పంత్.. 800+ రేటింగ్‌తో భారత టెస్ట్ చరిత్రలో బెస్ట్ వికెట్ కీపర్‌గా అవతరించారు. అలాగే, లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు.
04:52 PM (IST) Jun 25
ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ ప్రపంచం వేగంగా మారుతోంది. ఇందులో లాభదాయకత, వినియోగ సౌలభ్యం ఎంతో ముఖ్యమైనవి. ఇదే సమయంలో కొత్తవారికి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా, క్లౌడ్ మైనింగ్ అనే కొత్త అవకాశాన్ని (పలాడిన్ మైనింగ్) PaladinMining అందిస్తోంది.
04:28 PM (IST) Jun 25
ఈ శుక్రవారం (జూన్ 27న) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉందా? ఉంటే కొందరికి ఈవారం లాంగ్ వీకెండ్ గా మారనుంది. శుక్రవారం సెలవు ఎందుకో తెలుసా?
04:22 PM (IST) Jun 25
ప్రస్తుతం భారత్‌లో పెట్టుబడి, ఫైనాన్స్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి, ప్రభుత్వ సంస్థలైన సెబీ, ఆర్బీఐ నూతన నిబంధనలతో మార్కెట్ వాతావరణం మరింత అనుకూలంగా మారింది.
03:20 PM (IST) Jun 25
స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీకాలం ముగిసినా ఇప్పటి వరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని తెలంగాణ హైకోర్ట్ ప్రశ్నించింది. ఈ విషయమై బుధవారం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
02:12 PM (IST) Jun 25
Shubhanshu Shukla: ఎన్నో వాయిదాల తర్వాత ఆక్సియం-4 మిషన్ విజయవంతంగా పూర్తయింది. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాతో పాటు మరో ముగ్గురితో కూడిన ఆక్సియం-4 మిషన్కె కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
01:35 PM (IST) Jun 25
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయంపై కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ విమానాశ్రయంలో ఓ ప్లేన్ చక్కర్లుకొడుతున్న వీడియోను కూడా ఆయన సోషల్ మీడియా వేదికన పంచుకున్నారు.
12:57 PM (IST) Jun 25
న్యూస్ ఛానల్ చూడాలంటే భయం వేసే పరిస్థితి వచ్చింది, వార్త పత్రిక ఓపెన్ చేయాలంటే దడుసుకునే దుస్థితి. సమాజంలో జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే అసలు మనిషి మాయమవుతున్నాడా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
12:01 PM (IST) Jun 25
ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆనాటి ఉద్యమకారులకు ఆసక్తికర సూచన చేశారు. అదేంటో తెలుసా?
11:52 AM (IST) Jun 25
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య మొదలైన యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగడం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న భయాలు కూడా వచ్చాయి. అయితే చివరికి కథ సుఖాంతమైంది. రెండు దేశాలు కాల్పులు విరమించాయి.
10:18 AM (IST) Jun 25
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తోంది. మారుతోన్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు తగ్గాయి.
09:53 AM (IST) Jun 25
భారతీయ రైల్వే ప్రయాణికులపై భారం మోపింది. టికెట్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది… ఎంతమేర పెరిగాయో తెలుసా?
07:53 AM (IST) Jun 25
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ప్రారంభమైన వర్షాలు బుధవారం కూడా కొనసాగుతాయని వాతావరణ విభాగం సూచించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?