- Home
- Life
- Relationship
- Relationship: భర్త అంగీకారంతో మరో మగాడితో వివాహేతర సంబంధం.. ఇదెక్కడి దిక్కుమాలిన ట్రెండ్
Relationship: భర్త అంగీకారంతో మరో మగాడితో వివాహేతర సంబంధం.. ఇదెక్కడి దిక్కుమాలిన ట్రెండ్
ఇప్పటికే మారుతున్న సమాజంలో సంబంధాల మధ్య కూడా కొత్త ట్రెండ్‌లు కనిపిస్తున్నాయి. అందులో తాజా పేరు "హాట్ వైఫింగ్". ఇది పశ్చిమ దేశాల్లో పుట్టినప్పటికీ, ఇప్పుడు భారతదేశంలో కూడా చర్చకు వస్తోంది. ఇంతకీ కొత్త ట్రెండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హాట్ వైఫింగ్ అంటే ఏంటి?
హాట్ వైఫింగ్ అనేది ఓ మహిళ, తన భర్త అంగీకారంతో ఇతర పురుషులతో శారీరక సంబంధం ఏర్పరచుకునే విధానం. ఇందులో ఆమె భర్త పూర్తిగా తెలివిగా, అంగీకారంతో ఉంటాడు.
ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది?
ఇది కొన్ని జంటలలో, వారి లైంగిక జీవనంలో కొత్తతనం, అనుబంధం, విశ్వాసాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుందని నమ్మకం. అది కూడా ఇద్దరూ అంగీకరిస్తే మాత్రమే.
హాట్ వైఫింగ్‌లో భర్త పాత్ర
ఈ విధానంలో భర్తకు ప్రధాన పాత్ర ఉంటుంది. అతను ఈ సంబంధం గురించి తెలుసుకొని, మద్దతు ఇస్తాడు. కొందరు భర్తలు ఈ వ్యవహారాన్ని ప్రత్యక్షంగా చూస్తారు లేదా పరోక్షంగా భాగస్వామ్యంగా ఉంటారు.
ఇతరులతో సంబంధం
సాధారణంగా వివాహం అంటే ఇద్దరూ పరస్పరంగా మాత్రమే శారీరక సంబంధం పెట్టుకోవడం. కానీ హాట్ వైఫింగ్ పద్ధతిలో మహిళ ఇతరులతో కూడా సంబంధాలు కలిగి ఉండడం భర్త అంగీకారంతో జరుగుతుంది.
మనసు మీద ప్రభావం
కొంతమంది జంటలకి ఇది వారి సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. అయితే కొందరికి మాత్రం ఈ ప్రయోగం అసూయ, భయం, గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.
ఒప్పందంతో మాత్రమే
ఈ మొత్తం వ్యవహారానికి కేంద్రబిందువు ఒప్పందం. ఇద్దరూ పూర్తిగా అంగీకరిస్తేనే ఇది జరగాలి. ఎవరిపైనా బలవంతం కాదు.
మండిపడితోన్న సమాజం
అయితే ఈ కొత్త ట్రెండ్‌పై సమాజం ఓ రేంజ్‌లో మండిపడుతోంది. ఇలాంటి హద్దులు మీరిన ట్రెండ్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ కుటుంబ వ్యవస్థను నాశనం చేసే దిక్కుమాలిన ట్రెండ్ అంటూ విమర్శిస్తున్నారు. కుటుంబ బంధాలకు అత్యంత విలువ ఉండే భారత దేశంలో ఇలాంటి ట్రెండ్ మొదలవడం ఆందోళన కలిగించే అంశం.