- Home
- Sports
- Cricket
- Rishabh Pant: భారత వికెట్ కీపర్లలో తోపు.. ధోని సహా లెజెండరీ ప్లేయర్లను దాటేసిన రిషబ్ పంత్
Rishabh Pant: భారత వికెట్ కీపర్లలో తోపు.. ధోని సహా లెజెండరీ ప్లేయర్లను దాటేసిన రిషబ్ పంత్
Rishabh Pant : లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో రెండు సెంచరీలు బాదిన రిషబ్ పంత్.. 800+ రేటింగ్‌తో భారత టెస్ట్ చరిత్రలో బెస్ట్ వికెట్ కీపర్‌గా అవతరించారు. అలాగే, లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు.

ఇంగ్లాండ్ టెస్ట్‌లో పంత్ రికార్డుల వర్షం
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు చరిత్రాత్మక ప్రదర్శన కనబర్చింది. మొత్తం ఐదు సెంచరీలు నమోదైన ఈ మ్యాచ్‌లో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ రెండు సెంచరీలు బాదారు. మొదటి ఇన్నింగ్స్‌లో 134, రెండవ ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేయడంతో పాటు పంత్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు.
రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు - ప్రపంచంలో రెండవ వికెట్ కీపర్ పంత్
ఒకే టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన ప్రపంచంలో రెండవ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచారు. ఇదివరకు 2001లో జింబాబ్వే బ్యాట్స్‌మన్ అండి ఫ్లవర్ ఈ ఘనత సాధించారు.
800+ రేటింగ్‌తో ధోని రికార్డును బద్దలు కొట్టిన పంత్
రిషబ్ పంత్ ఇప్పుడు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 800 పైగా రేటింగ్ పాయింట్లు సాధించాడు. దీంతో భారత వికెట్ కీపర్లలో అత్యుత్తమ ర్యాంక్‌ను సంపాదించారు. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ మహేంద్ర సింగ్ ధోని తన తొమ్మిది ఏళ్ల టెస్ట్ కెరీర్‌లో సాధించలేని రికార్డును పంత్ 44 మ్యాచ్‌ల్లోనే సాధించడం విశేషం.
గిల్, బుమ్రా ర్యాంకింగ్స్‌లో మెరుగుదల
టెస్టులో సెంచరీ కొట్టిన టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఐదు స్థానాలు మెరుగుపడుతూ 20వ ర్యాంక్‌కు చేరాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అలాగే, భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ టెస్టులో రిషబ్ పంత్ రికార్డులు ఇవే
టెస్ట్‌లో 8వ సెంచరీని సాధించాడు. ఇంగ్లండ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన మొదటి భారత ఆటగాడిగా పంత్ నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు కొట్టిన రెండవ వికెట్‌కీపర్ గా నిలిచాడు. ఇంగ్లండ్‌లో 4 సెంచరీలతో అత్యధిక శతకాలు చేసిన విదేశీ వికెట్‌కీపర్ ఘతన సాధించాడు. ఒకే బౌలర్‌పై 7 సిక్సర్లు కొట్టిన మూడవ ఆటగాడు రిషబ్ పంత్.
ఇంగ్లాండ్ లో వరుసగా ఐదు ఇన్నింగ్స్ లలో 50+ పరుగులు
రిషబ్ పంత్ ఇంగ్లండ్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 50+ స్కోర్లు చేశాడు. ఇంగ్లండ్‌పై ఐదు సెంచరీలు కొట్టిన ఏకైక వికెట్ కీపర్‌గా ఘనత సాధించాడు. పంత్ రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు, దూకుడుగా ఆడటంతో "బాజ్‌బాల్" కాదు "పంత్‌బాల్" అంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి.