BeautyTips: అందమైన కనుబొమ్మల కోసం.. అద్భుతమైన ఈ చిట్కాలు ప్రయత్నించండి!

Navya G | Published : Sep 8, 2023 10:38 AM
Google News Follow Us

Beauty Tips: అందమైన కనుబొమ్మలు ముఖానికి ఒక ఆకృతిని తీసుకువస్తాయి. కనుబొమ్మలు పలుచబడి పోవటం, కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడం వలన ముఖం కొంత అందాన్ని కోల్పోతుంది. అందుకే అందమైన కనుబొమ్మల కోసం ఈ చిట్కాలు.
 

16
BeautyTips: అందమైన కనుబొమ్మల కోసం.. అద్భుతమైన ఈ చిట్కాలు ప్రయత్నించండి!

 కనుబొమ్మలు ముఖానికి ఒకలాంటి నిండుదనాన్ని తీసుకువస్తాయి. అయితే అవే కనుబొమ్మలు  వెంట్రుకలని రాలిపోయి కనిపిస్తే దాని ప్రభావం మొఖం మీద కూడా పడుతుంది. అందుకే అందమైన కనుబొమ్మల కోసం ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ చిట్కాలు పాటిద్దాం.

26

ఆలీవ్ నూనె జుట్టు పెరగటానికి ప్రేరేపిస్తుంది. ఆలీవ్ నూనెను కనుబొమ్మల మీద మర్దన చేయడం వలన అక్కడ వెంట్రుకలు రాలడం తగ్గి కనుబొమ్మలు మందంగా కనిపిస్తాయి. దీనికోసం మీరు ఆలివ్ ఆయిల్ తో కనుబొమ్మలని రాత్రిపూట మసాజ్ చేసి అలా వదిలేయండి.

36

రోజూ ఈ విధంగా చేయటం వలన కొన్ని రోజులలో కనుబొమ్మలలో కనిపించే తేడాని మీరే గమనిస్తారు. అలాగే కనుబొమ్మలు దట్టంగా పెరగటానికి పిప్పర్ మెంట్ ఆయిల్ కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే హెయిర్ పోలికల్స్ కు రక్తప్రసరణ మెరుగుపరచడం ద్వారా కనుబొమ్మల జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.

Related Articles

46

 అందుకే ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ ని మీ కనుబొమ్మలపై వృత్తాకార కదలికలలో సున్నితంగా మసాజ్ చేస్తే త్వరలోనే మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే అలోవెరా లో కూడా జుట్టు పెరుగుదలకు అవసరమైన పోలికల్  ను బలపరిచే ప్రభావాలని కలిగి ఉంటుంది. అలోవెరా జెల్ ని కొద్దిగా కొబ్బరి నూనెతో కలపండి.

56

తర్వాత ఆ మిశ్రమాన్ని కనుబొమ్మలపై మర్దన చేయండి. ఆ మిశ్రమం కనుబొమ్మలు పూర్తిగా గ్రహించిన తరువాత 10 నిమిషాలు అలాగే వదిలేయండి. తర్వాత  ముఖాన్ని కడుక్కోండి. ఈ చిట్కా కూడా దట్టమైన కనుబొమ్మలకి బాగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరి నూనె కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.

66

కొద్దిపాటి కొబ్బరి నూనె చేతిలోకి తీసుకొని మీ కనుబొమ్మల భాగాలలో మసాజ్ చేయండి. రాత్రిపూట అలా వదిలేసి మరుసటి రోజు పొద్దున్నే కడుక్కోవడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. అలాగే ఉల్లిపాయ రసాన్ని తేనెతో కలిపి కనుబొమ్మల ప్రాంతంలో అప్లై చేయడం వలన కూడా గుబురుగా ఉండే కనుబొమ్మలని పొందవచ్చు.

Recommended Photos