రేబిస్ అనేది రేబిస్ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఈ వైరస్ సోకిన జంతువులు ఎవరినైతే కరుస్తాయో వారికి లాలాజలం ద్వారా బాధితుడి రక్తంలోకి ప్రవేశిస్తుంది.
రేబిస్ వైరస్ సోకిన జంతువు గోళ్లు, పళ్లతో గీరినా, గాయం చేసినా కూడా వైరస్ వ్యాపిస్తుంది. కుక్కలు, కోతుల ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది.
కుక్క కరిచిన వెంటనే గాయాన్ని కడిగి శుభ్రం చేయాలి. తర్వాత వైద్యుడిని సంప్రదించాలి.
అరుదైన సందర్భాల్లో ఈరోసోల్ కణాలను పీల్చడం ద్వారా రేబిస్ వ్యాపిస్తుంది. గుహల్లో రేబిస్ సోకిన గబ్బిలాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది జరిగే అవకాశం ఉంది.
రేబిస్ సోకిన జంతువు తిన్న ఆహారం తినడం ద్వారా రేబిస్ వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఇలా జరగడం చాలా అరుదుగా జరుగుతుంది.
ప్రవర్తనలో మార్పులు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగడంలో ఇబ్బంది, అధిక లాలాజలం వంటివి రేబిస్ లక్షణాలు.
రేబిస్ కి ప్రత్యేకమైన చికిత్స లేదు. కొన్ని ప్రత్యేక మందులు, ఇంజెక్షన్ల ద్వారా కాపాడటానికి ప్రయత్నం మాత్రమే చేయాలి. ఒక్కోసారి మరణం తప్పదు.