Beauty Tips: మీ జుట్టు రాలిపోతుందా.. అయితే ఈ నూనెలను వాడితే మీ సమస్య తీరినట్లే!

Navya G | Published : Jul 25, 2023 5:00 PM
Google News Follow Us

Beauty Tips: జుట్టు ఊడిపోవడం, జుట్టు పెరగకపోవడం, మాడుపై చుండ్రు ఇవన్నీ నేటి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయితే ఇప్పుడు చెప్పబోయే నూనెలు వాడితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయంట అవేంటో చూద్దాం.
 

16
Beauty Tips: మీ జుట్టు రాలిపోతుందా.. అయితే ఈ నూనెలను వాడితే మీ సమస్య తీరినట్లే!

 పూర్వకాలంలో కేవలం ఒక కొబ్బరినూనె సరిపోయేది ఆ జుట్టుకి సరియైన పోషణ లభించి నల్లగా నిగనిగలాడుతూ పెరిగేది. కానీ నేటి కాలుష్య ప్రపంచంలో జుట్టు కి సరియైన పోషణ లభించడం లేదు దానికి తోడు మన అసమతుల్య జీవన విధానం యొక్క ప్రభావం కూడా జుట్టుపై పడుతుంది.

26

దీనివలన వెంట్రుకలు రాలిపోవడం చిట్లిపోవడం. చిన్నవయసులోనే జుట్టు మెరిసిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి నిజానికి రోజుకి 100 వెంట్రుకలు రాలిపోవడం సహజమే. అంతకుమించి జుట్టు రాలుతుందంటే ఖచ్చితంగా..
 

36

ఆ జుట్టుపై మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. అలాంటప్పుడే కొన్ని రకాల నూనెలను కలిపి జుట్టుకు పట్టిస్తే మంచి ఉత్తైనా పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. అయితే కొబ్బరి నూనె, ఆముదం, స్వీట్ బాదం నూనె, ఆలివ్  నూనె..

Related Articles

46

రోజ్ మేరీ నూనె సమపాళ్లల్లో కలిపి వారానికి రెండుసార్లు జుట్టుకి పట్టించడం వలన చిట్లిపోయిన పొడిబారిన పల్చబడ్డ జుట్టు సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. రోజు మేరీ నూనె జుట్టు పెరుగుదలని ప్రోత్సహించడానికి మీనాక్షిడల్ వలే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
 

56

మగవారిలో వచ్చే బట్టతల సమస్యకు రోజు మరియు ఆయిల్ మంచి ఎంపిక. జుట్టులో ఉండే చుండ్రుని క్లియర్ చేయటంలో సహాయపడుతుంది. ఈ ఆయిల్ లో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు జుట్టుని పొడిబారనీయకుండా పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే స్వీట్ బాదం నూనెలో పెద్ద మొత్తంలో విటమిన్ ఈ ఉంటుంది.

66

ఇది సహజ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి జుట్టు సమస్యలను తీరుస్తుంది. అలాగే కొబ్బరి నూనె లో ఉండే ఫ్యాటీ చైన్స్ క్యూటికల్ని ఉపశమనం చేస్తాయి జుట్టుని లోతుగా హైడ్రేట్ చేయడం వలన జుట్టు చిట్లిపోవడం పొడిబారడం పెలుసుగా మారడం వంటి సమస్యలని దూరం చేయవచ్చు. ఇక ఆముదం లో ఉండే ప్రోటీన్లు విటమిన్లు జుత్తు కి అవసరమైన పోషకాలని అందించి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

Recommended Photos